రేవంతు భూతంతు నుంచి ఆదుకోండి

  ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం : ఆర్‌డిఒ భరోసా మన తెలంగాణ/అత్తాపూర్, గచ్చిబౌలి : గోపన్నపల్లి భూముల బాధితుల ఫిర్యాదులు స్వీకరించిన ఆర్‌డిఒ చంద్రకళ మూడు రోజులలో ప్రభుత్వానికి నివేదిక పంపించి బాధితుల కు తగిన న్యాయం చేసి ఆదుకుంటామని భరో సా ఇచ్చారు. రేవంత్ రెడ్డి, అతని సోదరులు బె దిరించి అక్రమంగా తమ భూములలో ఉన్న రాళ్ల టను, ఫెన్సింగ్‌ను జెసిబి తొలగించారని గోపన్నపల్లి బాధితులు కల్లం పెరిరెడ్డి, కోల గు రువారెడ్డిలు గురువారం […] The post రేవంతు భూతంతు నుంచి ఆదుకోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం : ఆర్‌డిఒ భరోసా

మన తెలంగాణ/అత్తాపూర్, గచ్చిబౌలి : గోపన్నపల్లి భూముల బాధితుల ఫిర్యాదులు స్వీకరించిన ఆర్‌డిఒ చంద్రకళ మూడు రోజులలో ప్రభుత్వానికి నివేదిక పంపించి బాధితుల కు తగిన న్యాయం చేసి ఆదుకుంటామని భరో సా ఇచ్చారు. రేవంత్ రెడ్డి, అతని సోదరులు బె దిరించి అక్రమంగా తమ భూములలో ఉన్న రాళ్ల టను, ఫెన్సింగ్‌ను జెసిబి తొలగించారని గోపన్నపల్లి బాధితులు కల్లం పెరిరెడ్డి, కోల గు రువారెడ్డిలు గురువారం రాజేంద్రనగర్ ఆర్‌డిఒ చంద్రకళను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈక్రమంలో గోపన్నపల్లి భూ బాధితు లు సర్వే నెం 127లో కోల గురువారెడ్డి పేరు న అతని భార్య కోల అరుణ, వారి బంధువులపేరున మొత్తం నాలుగు వేల ఎనిమివందల గజాల భూమి ఉందని ఆర్‌డిఒకు తెలిపారు. భూములలో అడుగు పెట్టకుండా రౌడీలతో కొ ట్టిస్తున్నారని ఆర్‌డిఎ చంద్రకళకు వివరించా రు. పోలీసులను పెట్టి మాపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, కోర్టులు చుట్టూ తిరగడానికే సరిపోతోందని మాభూములు మాకు ఇప్పించాలని చంద్రకళను కోరారు. దీంతో ఆమె స్ప ందిస్తూ విచారణాధికారిగా తాను మూడు రో జుల్లోనే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని, అనతికాలంలోనే బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుంటామన్నారు.

గోపన్నపల్లిలో ఆందోళన
బాధితులు మల్లయ్య కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో కలిసి మా భూమి మాగ్గావాలే అంటూ గోపన్‌పల్లిలో ఆందోళన చేపట్టారు. సర్వే నం 127లో సదురు భూమి వద్దకు ఉదయానే వారు కుటుంబ సభ్యులు చిన్న పిల్లులు,వృద్దులు,మహిళలు అంత కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.తమకు న్యాయం చేయాలంటూ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకరంగా నినాదాలు చేశారు.ఈ సందర్బంగా బాధితుల్లో ఒకరైన హన్మయ్య మనవడు అనీల్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

అసలేం జరిగింది
శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నెం 127లో 10.21 ఎకరాల భూమి 1977వరకు వడ్డె హనుమయ్య,అతని వారసుడు వడ్డె మల్లయ్య పేరు మాద ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. కానీ 1978 నుంచి ఈ భూమి మల్లయ్య పేరు మీద పహభాణిలో న మోదవుతూ వచ్చింది. మల్లయ్య పేరు ఉంది కానీ ఆయన ఇంటి పేరు లేదు.1993,1994 నుంచి ఈ భూ మికి దబ్బ మల్లయ్య అని రెవెన్యూ రికార్డుల్లో నమోదు అవుతూ వచ్చింది.దబ్బ మల్లయ్య పేరును నమోదు చేయాడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ 2001, 2002 నుంచి పహాణిల్లో తొలగించారు. 2005లో అప్ప టి శేరిలింగంపల్లి డిప్యూటి ఇ.మల్లయ్య కు వారసుడిగా చెపుకునే ఇ.లక్ష్మయ్య పేరు మీద 2 ఎకరాల 21 గుం టల భూమిని రాశారు. ఆ భూమి లక్ష్మయ్య కాస్తులో ఉ న్నట్లు తేల్చేశారు.అదే తహసీల్దార్ మళ్లీ వివరాలను సవరిస్తూ లక్ష్మయ్య పేరు మీద మొదట 2కరాల 21 గుం టలను రాయడం,మళ్లీ సవరించి ముప్పై ఒకటిన్నర గుంటలకు మార్చడం రెండూ తహసీల్దార్ తన అధికార పరిధిని అతిక్రమించారు.

ఇలా అక్రమంగా లక్ష్మయ్య పే రు మీద రికార్డుల్లో నమోదైన ముప్పై ఒకటిన్నర గుం టల భూమిని అనుములు రేవంత్‌రెడ్డి కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ రాసుకున్నారు.ఇ.లక్ష్మయ్యకు ఎలాంటి పట్టదారు హక్కులు లేనప్పటికి అతని నుంచి భూమిని కోనుగోలు చేసినట్లు చేసుకున్న సేల్ డీడ్ ఆధారంగా వ్యవహింరించారు. రేవంత్‌రెడ్డి పేరును ఈ భూమికి హక్కు దారుడిగా పేర్కొంటూ 2005లో అప్పటి తహసీల్దార్ రికార్డుల్లో నమోదు చేశారు.ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇ.లక్ష్మయ్య ఒక ఎకరం 29 గుంటల భూమిని రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి అమ్మాడు.అధికారులు ఆ కొనుగోలు ప్రకారం కొండల్‌రెడ్డి పేరిట 2015లో మ్యుటేషన్ చేశారు.మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికి తన పేరు మీద ఉన్న డాక్యుమెంట్ల ద్వారా డి.మల్లయ్య లనే వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల హైమిని కళావతి అనే వ్యక్తికి అమ్మాడు.ఈ భూమిని కూడా అధికారులు కళావతి పేరు మీదకి బదిలిచేశారు.(మ్యూటేషన్ )ఆ తర్వాతా ఆభూమిని కళావతి అనే వ్యక్తి లనుముల కొండల్‌రెడ్డి పేరు మీద బదలాయించారు.

ఇంకోవైపు 1989లో ఎ.వెంకటరెడ్డి అనే వ్యక్తి దబ్బ మల్లయ్య పేరు మీద భూమి ఉన్నట్లు రికార్డుల్లో లేదు.వెంకటరెడ్డి ఈ భూమిలో ని 13 గుంటల భూమిని తర్వత ఎ.కొండల్‌రెడ్డి పేరు మీద బదిలీ చేశారు.గోపన్ పల్లి సర్వే నెం 127లో గల భూమికి సంబందించి తమకుహక్కు ఉందని,అనుములు రేవంత్‌రెడ్డి ఈ భూములును అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.అలాగే అనుములు కొండల్‌రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అనీల్‌కుమార్ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Land victims agitation in Gopanpally

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రేవంతు భూతంతు నుంచి ఆదుకోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: