సెమీస్ లో భారత్

షఫాలి మెరుపులు,  రాణించిన బౌలర్లు, ఉత్కంఠ పోరులో హర్మన్ సేన విజయం మెల్‌బోర్న్: వరుసగా మూడో విజయంతో భారత మహిళా జట్టు ట్వంటీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ మూడు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలి వర్మ (46) మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకుంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన […] The post సెమీస్ లో భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
షఫాలి మెరుపులు,  రాణించిన బౌలర్లు, ఉత్కంఠ పోరులో హర్మన్ సేన విజయం

మెల్‌బోర్న్: వరుసగా మూడో విజయంతో భారత మహిళా జట్టు ట్వంటీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ మూడు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలి వర్మ (46) మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకుంది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. అమెలియా కెర్ 34 (నాటౌట్) చివరి బంతి వరకు జట్టు గెలుపు కోసం పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది హ్యాట్రిక్ గెలుపు కావడం విశేషం. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో భారత మహిళలు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో ఓడినా కివీస్ మహిళలు ఆఖరి బంతి వరకు అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. ఒక దశలో టీమిండియా సునాయాస విజయం ఖాయమని కనిపించినా అమెలియా కెర్ అసాధారణ బ్యాటింగ్‌తో కివీస్‌ను గెలిపించినంత పని చేసింది.

చివరి రెండు ఓవర్లలో కివీస్ విజయానికి 34 పరుగులు అవసరమయ్యాయి. దీంతో భారత్ అలవోకగా విజయం సాధిస్తుందని అందరూ ఓ నమ్మకానికి వచ్చేశారు. కానీ, అమెలియా కెర్, హాలీ జెన్సస్ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో భారత్‌ను హడలెత్తించారు. ఇద్దరు అద్భుతంగా ఆడడంతో భారత్ ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్‌కు విజయం కోసం 16 పరుగులు అవసరమయ్యాయి. అమెలియా కెర్ రాణించడంతో కివీస్ మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లింది. చివరి బంతికి విజయం కోసం ఐదు పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ దాన్ని అందుకోలేక పోయింది.

దీంతో భారత్ మూడు పరుగుల తేడాతో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన మొదటి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. భారత్ తన చివరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. ఇందులో ఓడినా టీమిండియాకు సెమీస్ స్థానానికి ఢోకా ఉండదు. ఇక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకు ఆఖరి లీగ్ మ్యాచ్ చావో రేవోగా మారింది. ఇందులో గెలిచిన జట్టుకే సెమీఫైనల్ అవకాశాలు ఉంటాయి. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించక తప్పదు.
ఆరంభంలోనే

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ రాచెల్ ప్రిస్ట్ 12 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్‌లో ఔటైంది. అప్పటికీ కివీస్ స్కోరు 13 పరుగులే. వన్ డౌన్‌లో వచ్చిన సుజి బేట్స్ (6) కూడా నిరాశ పరిచింది. దీప్తి శర్మ అద్భుత బంతితో బేట్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసింది. ఆ వెంటనే మరో ఓపెనర్, కెప్టెన్ సోఫి డివైన్ కూడా పెవిలియన్ బాట పట్టింది. డివైన్ 14 పరుగులు చేసి పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటైంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను మాడీ గ్రీన్, కాటే మార్టిన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడిన గ్రీన్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. మార్టిన్ 25 పరుగులు సాధించింది. ఇక, కీలక ఇన్నింగ్స్ ఆడిన అమెలియా కెర్ 19 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు.

India vs New Zealand ICC Womens T20 World Cup

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సెమీస్ లో భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: