కేజ్రీవాల్, సిసోడియా ఎన్నికలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు గురువారం దాఖలు అయ్యాయి. ఎన్నికల ప్రచార నిబంధనలను ఉల్లంఘించి వీరిద్దరూ ప్రచారం సాగించారని ఆరోపిస్తూ ప్రతాప్ చంద్ర పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్ చంద్ర ఆప్ నేతలు కేజ్రీవాల్, సిసోడియాలకు వ్యతిరేకంగా పోటీ చేశారు. కేజ్రీవాల్, సిసోడియా వీరిద్దరూ పోలింగ్ తేదీకి 48 గంటలు ముందుగానే ప్రచారాన్ని ముగించ వలసి ఉండగా, […] The post కేజ్రీవాల్, సిసోడియా ఎన్నికలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు గురువారం దాఖలు అయ్యాయి. ఎన్నికల ప్రచార నిబంధనలను ఉల్లంఘించి వీరిద్దరూ ప్రచారం సాగించారని ఆరోపిస్తూ ప్రతాప్ చంద్ర పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్ చంద్ర ఆప్ నేతలు కేజ్రీవాల్, సిసోడియాలకు వ్యతిరేకంగా పోటీ చేశారు. కేజ్రీవాల్, సిసోడియా వీరిద్దరూ పోలింగ్ తేదీకి 48 గంటలు ముందుగానే ప్రచారాన్ని ముగించ వలసి ఉండగా, నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రచారం సాగించారని, అందుకని వారి ఎన్నికను రద్దు చేసి తిరిగి తాజాగా ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహింప చేయాలని పిటిషన్‌లో కోర్టును కోరారు. దీనిపై జస్టిస్ వికె రావు ఎన్నికల కమిషన్‌కు, సిసోడియాకు రిటర్నింగ్ ఆఫీసర్‌కు నోటీసులు జారీ చేశారు.

Pleas in HC challenge election of Kejriwal Sisodia

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కేజ్రీవాల్, సిసోడియా ఎన్నికలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: