2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్

యాపిల్ సిఇఒ టిమ్ కుక్ న్యూఢిల్లీ: త్వరలో భారత్‌లో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఐఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రకటించింది. 2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో జరిగిన యాపిల్ కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశంలో యాపిల్ చీఫ్ ఎక్సిక్యూటివ్ టిమ్‌కుక్ ఈ విషయం వెల్లడించారు. 2021లో స్థానిక భాగస్వామ్యం లేకుండా యాపిల్ కంపెనీ సొంతంగా బెంగుళూరులో యాపిల్ స్టోర్ ఏర్పాటు చేస్తుందని, దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి […] The post 2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
యాపిల్ సిఇఒ టిమ్ కుక్

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌లో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఐఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రకటించింది. 2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో జరిగిన యాపిల్ కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశంలో యాపిల్ చీఫ్ ఎక్సిక్యూటివ్ టిమ్‌కుక్ ఈ విషయం వెల్లడించారు. 2021లో స్థానిక భాగస్వామ్యం లేకుండా యాపిల్ కంపెనీ సొంతంగా బెంగుళూరులో యాపిల్ స్టోర్ ఏర్పాటు చేస్తుందని, దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందని అన్నారు.

దీనికంటే ముందుగానే భారత్‌లో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌ను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించనున్నట్లు టిమ్‌కుక్ తెలిపారు. యాపిల్ కంపెనీ 2018లోనే భారత్‌లో కంపెనీ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఇండియాలో ఉన్న చట్టాలకు అనుకూలంగా స్థానిక భాగస్వామ్యంతో యాపిల్‌స్టోర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరడంతో యాపిల్ కంపెనీ స్టోర్ ఏర్పాటును వాయిదా వేసిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా టిమ్‌కుక్ మాట్లాడుతూ, కరోనా వైరస్ యాపిల్ కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని, తమ త్రైమాసిక ఫలితాలు ఆశించినంతగా లేవని అన్నారు. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్స్ వంటి వాటికి విడిభాగాలన్నింటిని చైనా తయారు చేస్తోందని, కరోనా వైరస్ కారమంగా చైనాలో డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో తమ విక్రయాలు పడిపోయాయని టిమ్‌కుక్ వివరించారు.

 

First Apple Store in India in 2021

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: