త్రివిక్రమ్ మూవీకి శరవేగంగా సన్నాహాలు

  ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ ఇటీవల తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో నాన్ బాహుబలి రికార్డును అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… తారక్ 30వ చిత్రానికి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి ఉంచిన త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను చక్కదిద్దే పనిలో ఉన్నారట. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికతో పాటు షూటింగ్ లొకేషన్స్ సెలెక్షన్ వంటి అన్ని పనులను ఆయన దగ్గరుండి […] The post త్రివిక్రమ్ మూవీకి శరవేగంగా సన్నాహాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ ఇటీవల తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో నాన్ బాహుబలి రికార్డును అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… తారక్ 30వ చిత్రానికి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి ఉంచిన త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను చక్కదిద్దే పనిలో ఉన్నారట. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికతో పాటు షూటింగ్ లొకేషన్స్ సెలెక్షన్ వంటి అన్ని పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రం మే నుండి షూటింగ్ జరుపుకోనుంది. రెగ్యులర్ షూట్‌కి ఇంకా కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉన్నందువల్ల ప్రీ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తిచేసే పనిలో పడ్డారట. ఇక త్రివిక్రమ్ ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ టైటిల్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మూవీని త్రివిక్రమ్ తన గత చిత్రాలలాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా లేదా పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందించే అవకాశం ఉంది.

Movie in trivikram and jr NTR combination

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post త్రివిక్రమ్ మూవీకి శరవేగంగా సన్నాహాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: