అమెరికాకు ఆ భయం లేదు

కరోనా పై డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య మొదటి కేసు కనిపించిందన్న అమెరికా ఆరోగ్యశాఖ వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి గురించిన భయాల్ని తక్కువచేసి చూపేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. కరోనా పై ప్రపంచమంతా వణుకుతున్న నేపథ్యంలో ఇస్లాం పవిత్ర ప్రాంతాల్లో యాత్రికులపై సౌదీ అరేబియా నిషేధాన్ని విధించే పరిస్థితి ఏర్పడింది. ‘పరిస్థితి క్షీణించవచ్చు. ప్రమాదకరంగా మారవచ్చు. దేన్నీ ఆపలేం. కానీ ఆందోళన అనవసరం’ అని ట్రంప్ వైట్ హౌస్‌లో విలేకరులకు చెప్పారు. అయితే, ట్రంప్ […] The post అమెరికాకు ఆ భయం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరోనా పై డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య
మొదటి కేసు కనిపించిందన్న అమెరికా ఆరోగ్యశాఖ

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి గురించిన భయాల్ని తక్కువచేసి చూపేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. కరోనా పై ప్రపంచమంతా వణుకుతున్న నేపథ్యంలో ఇస్లాం పవిత్ర ప్రాంతాల్లో యాత్రికులపై సౌదీ అరేబియా నిషేధాన్ని విధించే పరిస్థితి ఏర్పడింది. ‘పరిస్థితి క్షీణించవచ్చు. ప్రమాదకరంగా మారవచ్చు. దేన్నీ ఆపలేం. కానీ ఆందోళన అనవసరం’ అని ట్రంప్ వైట్ హౌస్‌లో విలేకరులకు చెప్పారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా ఆరోగ్య అధికారుల అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయి.

బహిరంగ ప్రదేశాల్లో కలుసుకోవడం వంటివి రద్దు చేసుకునేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉండాలి. ఇంటి నుంచే పనిచేయండి. అమెరికాలో ఇప్పటికే 60 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య అధికారులు విజ్ఞప్తి చేశారు. ట్రంప్ అంచనాలను తోసిపుచ్చుతూ అమెరికా సెంటర్ ఆఫ్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటన చేసింది. దేశంలో ఒక గుర్తు తెలీని ప్రదేశం నుంచి ఒక కేసును కనుగొన్నామని, అది సమాజంలో వర్గాల మధ్య వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా, 1600 కరోనా కేసులు నమోదైన ఇటలీ, దక్షిణ కొరియాల పర్యటనలపై ఆంక్షలు విధించాలని అమెరికా ఆలోచిస్తోందని ట్రంప్ చెప్పారు. చైనాకు అమెరికా ఇప్పటికే రాకపోకలపై ఆంక్షలు విధించింది.

Donald Trump Comments on Coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమెరికాకు ఆ భయం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: