నిరుద్యోగ ఎంబిసిలకు కెసిఆర్ అంబులెన్స్‌లు

  హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎంబిసి నిరుద్యోగులకు కెసిఆర్ ఆపద్భందు పేరిట అంబులెన్స్ వాహనాలను అందజేయాలని నిర్ణయించారు. గురువారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదర్ సంజీవయ్య భవన్‌లో రాష్ట్ర స్థాయి జిల్లా బిసి సంక్షేమ అధికారుల సమీక్షా సమావేశంలో రాష్ట్ర బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పైలెట్ పథకంగా అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన (ఎంబిసి) నిరుద్యోగ యువతకు కెసిఆర్ […] The post నిరుద్యోగ ఎంబిసిలకు కెసిఆర్ అంబులెన్స్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎంబిసి నిరుద్యోగులకు కెసిఆర్ ఆపద్భందు పేరిట అంబులెన్స్ వాహనాలను అందజేయాలని నిర్ణయించారు. గురువారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదర్ సంజీవయ్య భవన్‌లో రాష్ట్ర స్థాయి జిల్లా బిసి సంక్షేమ అధికారుల సమీక్షా సమావేశంలో రాష్ట్ర బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పైలెట్ పథకంగా అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన (ఎంబిసి) నిరుద్యోగ యువతకు కెసిఆర్ అపద్భందు పేరిట అంబులెన్స్ వాహనాలు అందజేయు పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రతి జిల్లాలకు ఒక్క అంబులెన్స్ వాహనం అందజేయడానికి గ్రూపులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గూపులో ఐదు గురు నిరుద్యోగులకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద బిసి మహిళలకు కుట్టు మిషన్‌లను అందించడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్‌లు అందించడం జరుగుతుందన్నారు. బిసి నిరుద్యోగ యువతకు నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ మేరకు బిసి అభివృద్ధి, సంక్షేమానికి ఏర్పాటు చేసిన 11 ఫెడరేషన్‌ల ద్వారా ఆయా వృత్తుల వారికి ఆయా రంగాలల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. సిఎంకెసిఆర్ ఆశయాలు, కన్న కలల మేరకు బంగారు తెలంగాణ సాధనకు తమ వంతు కృషి చేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో మహాత్మా జ్యోతిభా పూలే గురుకులాల వసతి గృహాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులు సందర్శించే విధంగా జిల్లా అధికారులు కార్యచరణ ప్రణాళికలు రూపోందించి, అమలు చేయాలని మంత్రి అదేశించారు. వార్షీక పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా బిసి గురుకులాలలో విద్యాభాస్యం చేయు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఫలితాల సాధన పై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

ఈ మేరకు త్వరలో జిల్లాల వారిగా పర్యటనలు జరుపుతామన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాలోని బిసి గురుకులాలు, వసతి గృహాలు, ఆయా పథకాలను క్షేత్ర స్థాయి పర్యటనల ద్వారా సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు శాశ్విత ప్రాతిపదిక మీదుగా సంక్షేమాధికారుల నియామక ప్రక్రియ పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా బిసి కులాలకు సంక్షేమ ఫలాలు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సైదా, బిసి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఎంబిసి కార్పొరేషన్ సిఈఒ అలోక్ కుమార్, జ్యోతిబాపూలే విద్యా సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, బిసి సంక్షేమ శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి కంది శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

KCR Apathbandhu Ambulances for MBC Unemployed

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిరుద్యోగ ఎంబిసిలకు కెసిఆర్ అంబులెన్స్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: