శభాష్ కలెక్టర్.. పింఛన్ కోసం వచ్చిన వృద్ధురాలిపై కలెక్టర్ కనికరం

  హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌కు బుధవారం ఓ వృద్ధురాలు వచ్చింది. మెట్లపై కూర్చొని అధికారుల కోసం చాలా సేపు వేచి ఉంది. అంతలో విధులకు హాజరైన కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఆజీం ఆ వృద్ధురాలిని చూసి, మెట్లపై ఆమె పక్కన కూర్చొని పెద్దమ్మా ఏం కావాలి, ఇటొచ్చావని అడిగారు. వచ్చిన అతను కలెక్టర్ అని తెలియని ఆ వృద్ధురాలు సామాన్యుడితో మాట్లాడినట్లే ‘రెండేళ్ల నుంచి పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని […] The post శభాష్ కలెక్టర్.. పింఛన్ కోసం వచ్చిన వృద్ధురాలిపై కలెక్టర్ కనికరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌కు బుధవారం ఓ వృద్ధురాలు వచ్చింది. మెట్లపై కూర్చొని అధికారుల కోసం చాలా సేపు వేచి ఉంది. అంతలో విధులకు హాజరైన కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఆజీం ఆ వృద్ధురాలిని చూసి, మెట్లపై ఆమె పక్కన కూర్చొని పెద్దమ్మా ఏం కావాలి, ఇటొచ్చావని అడిగారు. వచ్చిన అతను కలెక్టర్ అని తెలియని ఆ వృద్ధురాలు సామాన్యుడితో మాట్లాడినట్లే ‘రెండేళ్ల నుంచి పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని వచ్చినా’ అని ఆయనతో తెలిపింది. ఎంతో ఆప్యా యంగా అమెతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్న కలెక్టర్ వెంటనే డిఆర్డీఓకు ఫోన్ చేసి వివరాలు చెప్పి ఆ వృద్ధురాలికి పింఛన్ మంజూరు చేయించారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా శభాష్ కలెక్టర్ అంటూ అభినందించారు.

Collector pity on the oldWoman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శభాష్ కలెక్టర్.. పింఛన్ కోసం వచ్చిన వృద్ధురాలిపై కలెక్టర్ కనికరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: