స్కూళ్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: మహిళ మృతి

  మన తెలంగాణ/ మధిర రూరల్: ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలోకి ట్రాక్టర్ దూసుకు వచ్చిన సంఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రాపురం గ్రామంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవర్ ట్రాక్టర్‌ను నడపటంతో అదుపు తప్పి స్థానిక ప్రాథమిక పాఠశాలలోకి దూసుకెళ్లి స్కూల్‌లో మధ్యాహ్న భోజన వర్కర్‌గా పనిచేస్తున్న డ్వాక్రా మహిళ మెంబర్ జానపాటి లక్ష్మీ(43)ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే […] The post స్కూళ్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: మహిళ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/ మధిర రూరల్: ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలోకి ట్రాక్టర్ దూసుకు వచ్చిన సంఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రాపురం గ్రామంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవర్ ట్రాక్టర్‌ను నడపటంతో అదుపు తప్పి స్థానిక ప్రాథమిక పాఠశాలలోకి దూసుకెళ్లి స్కూల్‌లో మధ్యాహ్న భోజన వర్కర్‌గా పనిచేస్తున్న డ్వాక్రా మహిళ మెంబర్ జానపాటి లక్ష్మీ(43)ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్కూల్ ఆవరణం ముందు జెండా దిమ్మె ఉండటంతో పాఠశాలలోకి దూసుకు వచ్చిన ట్రాక్టర్‌కు దిమ్మె తగిలి పూర్తిగా పాఠశాలలోకి రాకపోవటంతో విద్యార్ధులకు పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ దూసుకువచ్చిన సమయంలో విద్యార్ధులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వైరా ఎసిపి సత్యనారాయణ, మధిర టౌన్, రూరల్ ఎస్‌ఐలు ఉదయ్‌కుమార్, లవన్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌ను చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో జానపాటి లక్ష్మీ మృతి చెందటం పట్ల మృతురాలి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

 

Women Dead in Tractor rams into School Building

The post స్కూళ్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: మహిళ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: