దేవరకొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కెటిఆర్

నల్లగొండ: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తున్నారు. ఈ  పర్యటనలో భాగంగా దేవరకొండ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నెట్‌వర్క్‌, రోడ్లు, పార్క్‌, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కెటిఆర్ శ్రీకారం చుట్టారు. దేవరకొండ 10వ వార్డులోని హనుమాన్ నగర్, లక్ష్మీకాలనీ, జంగాల కాలనీల్లో పర్యటిస్తూ ఆయన ప్రజలసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ రమావత్‌ […] The post దేవరకొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తున్నారు. ఈ  పర్యటనలో భాగంగా దేవరకొండ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నెట్‌వర్క్‌, రోడ్లు, పార్క్‌, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కెటిఆర్ శ్రీకారం చుట్టారు. దేవరకొండ 10వ వార్డులోని హనుమాన్ నగర్, లక్ష్మీకాలనీ, జంగాల కాలనీల్లో పర్యటిస్తూ ఆయన ప్రజలసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ రమావత్‌ రవీంద్రకుమార్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ తదితరులతో పాటు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

KTR laid foundation stone for development works

The post దేవరకొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: