ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పోచంపల్లి శాలువా కప్పి, చార్మినార్ మెమోంటో ఇవ్వనున్నారు సిఎం. మెలానియా, ఇవాంకలకు ప్రత్యేక్షంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను కెసిఆర్ బహూకరించనున్నారు. ఈ విందులో మొత్తం […] The post ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పోచంపల్లి శాలువా కప్పి, చార్మినార్ మెమోంటో ఇవ్వనున్నారు సిఎం.

మెలానియా, ఇవాంకలకు ప్రత్యేక్షంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను కెసిఆర్ బహూకరించనున్నారు. ఈ విందులో మొత్తం 90 నుంచి 95 విఐపిలు పాల్గొననున్నట్టు సమాచారం. వీరిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఉన్నారు. సిఎం కెసిఆర్‌‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్నాటక, అసోం, హరియాణా, బిహార్‌ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.  బుధవారం సిఎం కెసిఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తారు.

CM KCR for Delhi today to dine with Donald Trump

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: