ద్రవ్య విధాన నిర్ణయాలను ఆర్‌బిఐ సమీక్షిస్తోంది

  ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ న్యూఢిల్లీ: ద్రవ్య విధాన నిర్ణయాలను రిజర్వు బ్యాంక్ సమీక్షిస్తోందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్య విధాన నిర్ణయంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కేంద్ర బ్యాంకు సమీక్షిస్తోందని దాస్ అన్నారు. ప్రభుత్వంతో సహా సంబంధిత సంస్థలతో దీనిపై చర్చించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని ఒక నిర్దిష్ట పరిధిలో ఉంచేందుకు గాను ఆర్‌బిఐ గవర్నర్ అధ్యక్షతన 2016లో ద్రవ్య విధాన కమిటీని ప్రభుత్వం నిర్ణయించింది. పాలసీ రేటు (రెపో […] The post ద్రవ్య విధాన నిర్ణయాలను ఆర్‌బిఐ సమీక్షిస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్

న్యూఢిల్లీ: ద్రవ్య విధాన నిర్ణయాలను రిజర్వు బ్యాంక్ సమీక్షిస్తోందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్య విధాన నిర్ణయంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కేంద్ర బ్యాంకు సమీక్షిస్తోందని దాస్ అన్నారు. ప్రభుత్వంతో సహా సంబంధిత సంస్థలతో దీనిపై చర్చించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని ఒక నిర్దిష్ట పరిధిలో ఉంచేందుకు గాను ఆర్‌బిఐ గవర్నర్ అధ్యక్షతన 2016లో ద్రవ్య విధాన కమిటీని ప్రభుత్వం నిర్ణయించింది. పాలసీ రేటు (రెపో రేటు) నిర్ణయించే బాధ్యతను కమిటీకి అప్పగించారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీకి 2 శాతం పెరుగుదలతో ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచే బాధ్యతను అప్పగించారు. ద్రవ్య విధానం మూడున్నర సంవత్సరాలుగా పనిచేస్తోంది. ద్రవ్య విధాన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూడటానికి అంతర్గత సమీక్షా విధానాన్ని ప్రారంభించామని అన్నారు.

వినియోగదారులకు ద్రవ్య విధానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గవర్నర్ మాట్లాడుతూ ఇది క్రమంగా మెరుగుపడుతోందని అన్నారు. రాబోయే కాలంలో ఇది మరింత వృద్ధి అవుతుందని అన్నారు. డిసెంబర్ ఎంపిసిలో కొత్త రుణాలలో 0.49 శాతం ప్రయోజనం వినియోగదారులకు ఇవ్వగా, ఫిబ్రవరిలో ఇది 0.69 శాతానికి పెరిగింది. అంటే అది మెరుగుపడిందని అర్థమని అన్నారు. 2020 ఫిబ్రవరి 6న ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) పాలసీ రేటు రెపోను వరుసగా రెండవ సారి 5.15 శాతంతో ఆర్‌బిఐ యథాతథంగా కొనసాగించింది. పాలసీ రేటు డిసెంబరులో మారకుండా ఉండటానికి ముందు వరుసగా ఐదుసార్లు తగ్గించింది. మొత్తం 1.35 శాతం కోత ఉంది.

RBI reviewing monetary policy framework

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ద్రవ్య విధాన నిర్ణయాలను ఆర్‌బిఐ సమీక్షిస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.