సమీపిస్తున్న బ్యాంకుల విలీనం గడువు

  ఏప్రిల్ 1నాటికి ప్రక్రియ సవాలే గడువును పొడిగించే అవకాశాలే ఎక్కువ న్యూఢిల్లీ : పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి విధించిన ఏప్రిల్ 1 గడువు వేగంగా సమీపిస్తోంది. అయితే ఇంకా చాలా రెగ్యులేటరీ ఆమోదాలు, ఇతర ప్రక్రియలు పూర్తి కాలేదు. అందువల్ల ఈ గడువులు పొడిగించవచ్చని తెలుస్తోంది. ప్రతిపాదిత బ్యాంకుల విలీన పథకానికి కేబినెట్ ఆమోదం ఉన్నప్పటికీ వాటా మార్పిడి నిష్పత్తి, వాటాదారుల సమ్మతి, ఇతర నియంత్రణ ఆమోదాలు పొందడానికి కనీసం 30 నుంచి -45 […] The post సమీపిస్తున్న బ్యాంకుల విలీనం గడువు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏప్రిల్ 1నాటికి ప్రక్రియ సవాలే
గడువును పొడిగించే అవకాశాలే ఎక్కువ

న్యూఢిల్లీ : పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి విధించిన ఏప్రిల్ 1 గడువు వేగంగా సమీపిస్తోంది. అయితే ఇంకా చాలా రెగ్యులేటరీ ఆమోదాలు, ఇతర ప్రక్రియలు పూర్తి కాలేదు. అందువల్ల ఈ గడువులు పొడిగించవచ్చని తెలుస్తోంది. ప్రతిపాదిత బ్యాంకుల విలీన పథకానికి కేబినెట్ ఆమోదం ఉన్నప్పటికీ వాటా మార్పిడి నిష్పత్తి, వాటాదారుల సమ్మతి, ఇతర నియంత్రణ ఆమోదాలు పొందడానికి కనీసం 30 నుంచి -45 రోజులు పట్టవచ్చని ఒక బ్యాంకు అధికారి తెలిపారు. రాబోయే మూడు నుంచి ఐదేళ్ల వరకు ఈ బ్యాంకుల ఆర్థిక అంశాల గురించి ప్రధాని కార్యాలయం (పిఎంఒ) నుంచి సమాచారం కోరినట్లు ఆ అధికారి తెలిపారు. ఎన్‌పిఎలు, మూలధన అవసరం, రుణ వృద్ధి, విలీనాల నుండి ఖర్చు తగ్గింపు గురించి సమాచారాన్ని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి విలీనాన్ని అమలు చేసే అవకాశం ప్రస్తుతానికి ఆల స్యం కావొచ్చని తెలుస్తోందని అన్నారు.

రెగ్యులేటరీ ఆమోదాలతోపాటు, విలీన ప్రణాళికను పార్లమెంటులో 30 రోజులు ఉంచుతారు. తద్వారా ఎంపీలు దీనిని అధ్యయనం చేయవచ్చు. బడ్జెట్ సెషన్ రెండవ భాగం మార్చి 2 నుండి ప్రారంభమవుతుంది. గత ఏడాది ఆగస్టులో 10 ప్రభు త్వ రంగ బ్యాంకులను విలీనంతో నాలుగు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రణాళిక ప్రకారం యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం కానున్నాయి. ఈ విలీనం తరువాత ఇది రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అవుతుంది. సిండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంకులో విలీనం చేయాల్సి ఉండగా, అలహాబాద్ బ్యాంక్‌ను ఇండియ న్ బ్యాంక్‌లో విలీనం చేయనున్నారు.

అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్, కోఆపరేషన్ బ్యాంక్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానున్నా యి. విలీనం ప్రకటించిన 10 నెలల తరువాత కూడా విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ప్రక్రియ ఇంకా పురోగతిలో ఉందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అలాగే మానవ వనరుల సమస్యలు వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రతిపాదిత విలీనాన్ని బ్యాంక్ యూనియన్లు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

April 1 deadline to Merger of 10 public sector banks

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమీపిస్తున్న బ్యాంకుల విలీనం గడువు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.