ఢిల్లీలో రగిలిన ‘కా’ చిచ్చు

  సిఎఎ వ్యతిరేక, మద్దతుదార్ల ఘర్షణ పోలీసుల బాష్పవాయువు ప్రయోగం, పలువురికి గాయాలు న్యూఢిల్లీ : కొత్త పౌరచట్టం (సిఎఎ) వ్యతిరేక, అనుకూల ప్రదర్శనకారులతో ఢిల్లీలోని జఫ్రాబాద్ ప్రాంతంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్‌లో తొలుత వందల సంఖ్యలో సిఎఎ నిరసనకారులు రోడ్లపై భైఠాయించారు. ఇది తెలియగానే స్థానిక బిజెపి నేతల ఆధ్వర్యంలో అక్కడికి సిఎఎ మద్దతుదార్లు చేరుకున్నారు. చట్టానికి వ్యతిరేక, అనుకూల […] The post ఢిల్లీలో రగిలిన ‘కా’ చిచ్చు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిఎఎ వ్యతిరేక, మద్దతుదార్ల ఘర్షణ
పోలీసుల బాష్పవాయువు ప్రయోగం, పలువురికి గాయాలు

న్యూఢిల్లీ : కొత్త పౌరచట్టం (సిఎఎ) వ్యతిరేక, అనుకూల ప్రదర్శనకారులతో ఢిల్లీలోని జఫ్రాబాద్ ప్రాంతంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్‌లో తొలుత వందల సంఖ్యలో సిఎఎ నిరసనకారులు రోడ్లపై భైఠాయించారు. ఇది తెలియగానే స్థానిక బిజెపి నేతల ఆధ్వర్యంలో అక్కడికి సిఎఎ మద్దతుదార్లు చేరుకున్నారు. చట్టానికి వ్యతిరేక, అనుకూల నినాదాలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఓ వైపు వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్నారని సిఎఎ నిరసనకారులను పోలీసులు ఖాళీ చేయించే దశలోనే వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. మౌజ్‌పూర్ ప్రాంతంలో ఇరువర్గాల ఘర్షణ, బాష్పవాయు ప్రయోగంతో ఈ ప్రాంతంతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాలలో భయాందోళనలు నెలకొన్నాయి.

మెట్రోరైళ్ల స్టేషన్ల ప్రధాన ద్వారాలను నిరసనకారులు మూసివేశారు. భద్రతా కారణాలతో అధికారులు రంగంలోకి దిగి మౌజ్‌పూర్ బాబర్‌పూర్ మెట్రోస్టేషన్ గేట్లను మూసివేయించారు. ఆయా ప్రాంతాలలోని మెట్రో స్టేషన్లలో రైళ్లు నిలవకుండానే వెళ్లాయి. తొలుత మహిళలు ఎక్కువగా ఉన్న 500 మందితో కూడిన బృందం జఫ్రాబాద్ మెట్రోస్టేషన్ వద్ద రోడ్లపైకి చేరింది. సిఎఎకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. కొద్ది సేపటికే అక్కడి బిజెపి నేత కపిల్ మిశ్రా ఆధ్వర్యంలో సిఎఎ మద్దతుదార్లు రోడ్లపైకి వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్దనే ఈ గుంపు భైఠాయించింది. కొద్ది దూరంలో సిఎఎ వ్యతిరేకులు ఉండటంతో పరస్పర నినాదాలకు దిగడంతో ఉద్రిక్తత రాజుకుంటూ పోయి, మధ్యాహ్నానికి ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. రాళ్లు సీసాలు రువ్వారని, తమను కొట్టేందుకు దూసుకువచ్చారని ఇరు వర్గాలు ఆరోపణలకు దిగాయి.

పౌరచట్టం (సిఎఎ) పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనకారులు తొలుత ఆదివారం రహదారులను స్తంభింపచేశారు. రాజధానిలోని జఫ్రాబాద్, డిఎంఆర్‌సి రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు. దీనితో జఫ్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.షహీన్‌బాగ్ తరహా వాతావరణం ఇక్కడ కూడా చోటుచేసుకుంది. నిరసనకారులు అక్కడి మెట్రోస్టేషన్ ద్వారాలను కూడా మూసివేశారు. స్థానిక రోడ్ నెంబరు 66 దిగ్బంధంతో సలీంపూర్ నుంచి మౌజ్‌పూర్‌కు వెళ్లే దారులు, యమునా విహార్ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే సిఎఎను రద్దు చేయాలని ఎక్కువ సంఖ్యలో మహిళలతో కూడిన నిరసనకారులు ఉత్తర ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రోస్టేషన్ వెలుపల భైఠాయించారు. గేట్లు మూసివేయడంతో మెట్రోరైళ్లు ఇక్కడ ఆగకుండానే వెళ్లిపొయ్యాయి. ఈ ప్రాంతపు మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత నిరసనకారులు రోడ్లపైకి చేరుకుని, పలు ప్రాంతాలలో ఆదివారం ఉదయం నుంచి రాకపోకలను అడ్డుకున్నారు. ప్రధాన రాదార్లలో అడ్డంకులు కల్పించారు.

Clash erupts between pro & anti CAA groups in Jaffrabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఢిల్లీలో రగిలిన ‘కా’ చిచ్చు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.