ఎదురుచూసిన క్షణం.. విశిష్ట అతిథి విచ్చేస్తున్నాడు

  సోమవారం ఉదయం 11.40గం.కు అహ్మదాబాద్ చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు ఉ.11.40గం.కు అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ విమానాశ్రయానికి ట్రంప్ 12.15గం.కు సబర్మతీ ఆశ్రమానికి చేరిక. 1.05గం.కు మొతేరా స్టేడియానికి ట్రంప్, మోడీ. ప్రారంభోత్సతవం. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో దాదాపు 1.25 లక్షల మందిని ఉద్దేశించి ఇరువురి ప్రసంగం. ఆహ్మదాబాద్‌లోనే ట్రంప్, మోడీ మధ్యాహ్న భోజనం. 3.30గం.కు ట్రంప్ దంపతులు ఆగ్రా పయనం 4.45గం.కు తాజ్‌మహల్ సందర్శన 6.45గం.కు ఢిల్లీ పయనం 7.30 గం.కు ఢిల్లీ చేరిక, ఐటిసి […] The post ఎదురుచూసిన క్షణం.. విశిష్ట అతిథి విచ్చేస్తున్నాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సోమవారం ఉదయం 11.40గం.కు అహ్మదాబాద్ చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు

ఉ.11.40గం.కు అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ విమానాశ్రయానికి ట్రంప్
12.15గం.కు సబర్మతీ ఆశ్రమానికి చేరిక.
1.05గం.కు మొతేరా స్టేడియానికి ట్రంప్, మోడీ. ప్రారంభోత్సతవం. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో దాదాపు 1.25 లక్షల మందిని ఉద్దేశించి ఇరువురి ప్రసంగం.
ఆహ్మదాబాద్‌లోనే ట్రంప్, మోడీ మధ్యాహ్న భోజనం. 3.30గం.కు ట్రంప్ దంపతులు ఆగ్రా పయనం

4.45గం.కు తాజ్‌మహల్ సందర్శన
6.45గం.కు ఢిల్లీ పయనం
7.30 గం.కు ఢిల్లీ చేరిక, ఐటిసి మౌర్య హోటల్‌లో బస.

భార్య మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు కుష్నర్ సహా భారత్‌కు బయలుదేరిన ట్రంప్
నమస్తేట్రంప్ కార్యక్రమానికి ముస్తాబైన అహ్మదాబాద్ మొతేరా స్టేడియం
స్టేడియంలో 1.25లక్షల మందిని ఉద్దేశించి ప్రసంగించనున్న డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశ రెండు రోజుల పర్యటన సోమవారం నుంచి ప్రారంభం అవుతోంది. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్, ఉన్నతస్థాయి అధికార యంత్రాంగంతో కలిసి సోమవారంనాడు ట్రంప్ భారతదేశం వస్తున్నారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు మొదటిపేజీ తరువాయి
అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీల్లో పర్యటిస్తారు.

ఎదురు చూస్తున్నాం: మోడీ
‘డోనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు భారతదేశం ఆసక్తితో ఎదురు చూస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగే చరిత్రాత్మక కార్యక్రమంతో ప్రారంభించి ఆయన మనతో ఉండడం మనకు గౌరవం’ అని మోడీ ట్వీట్ చేశారు. అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చేసిన ట్వీట్‌కు మోడీ ఈవిధంగా స్పందించారు. ‘గుజరాత్ మొత్తం ‘నమస్తే ట్రంప్’ అంటూ ఏక కంఠంతో నినదిస్తోంది’ అని రూపానీ ట్వీట్ చేశారు.

అధినాయకుల చర్చలు
ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన మార్పులు రావచ్చనుకుంటున్నారు. అయితే వాణిజ్య సుంకాల వంటి కీలకమైన సమస్యల విషయంలో అంతగా ఫలితం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఆర్థికంగా, సైనికంగా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న తరుణంలో ఈ ప్రాంతంలో ప్రధాన భౌగోళిక రాజకీయ పరిణామాలపై సానుకూల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచానికి ఒక సందేశం ట్రంప్ పర్యటన ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. మంగళవారం ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగే చర్చల్లో వైవిధ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు విస్తృతస్థాయిలో ప్రాధ్యాన్యం వహించే అవకాశం ఉంది. వ్యాపారం పెట్టుబడులు, రక్షణ భద్రత, ఉగ్రవాదంపై పోరు, ఇంధన భద్రత, మతస్వేచ్ఛ, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లతో ప్రతిపాదిత శాంతి ఒప్పందం, ఇండో పసిఫిక్‌లో పరిస్థితి వంటి ముఖ్యాంశలపై వారిమధ్య చర్చలు జరగవచ్చని భారత, అమెరికా అధికారులు చెబుతున్నారు.

సిఎఎ ఆందోళనల నేపథ్యంలో…
నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో విస్తృతస్థాయిలో ఆందోళనలు, కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌తో తీవ్రమైన అభిప్రాయభేదాలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ పర్యటన జరుగుతోంది. ‘ ప్రజాస్వామ్యం, మతపరమైన స్వేచ్ఛలపై తను బహిరంగంగా, ప్రైవేట్‌గా చేసిన ప్రకటనలపై ట్రంప్ మాట్లాడవచ్చు. ఆయన ఈ అంశాలను ప్రధానంగా… పాలనకు ఎంతో ముఖ్యాంశమని భావించే మతస్వేచ్ఛ గురించి ఆయన ప్రస్తావిస్తారు’ అని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సంబంధాల విషయంలో కొన్ని పొరపొచ్చాలున్నా, రెండు ప్రజాస్వామిక దేశాల మధ్య అంతర్జాతీయంగా పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం పరంగా చూస్తే అధ్యక్షుడిగా ట్రంప్ తొలి భారత పర్యటన రెండు దేశాలనూ ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.

అయిదు ఒప్పందాలు?
గురువారంనాడు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్‌కుమార్ చేసిన ప్రకటన ప్రకారం … మేధోసంపద హక్కులు, వ్యాపార ప్రయోజనాలు, స్వదేశీ భద్రతకు సంబంధించి ఐదు ఒప్పందాలు ట్రంప్ పర్యటనలో కుదరవచ్చు. వీటిలో ప్రధానమైంది 2.6 బిలియన్ డాలర్ల వ్యయం కాగల 24 ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అమెరికా నుంచి భారతదేశం కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందానికి రావడం. అలాగే, 800 మిలియన్ డాలర్ల వ్యయమయ్యే ఆరు ఎహెచ్ 64 ఇ అపాచీ హెలికాప్టర్లను అమెరికా నుంచి సమకూర్చుకోవడానికి ఒప్పందం చేసుకోవడం మరో ప్రధానాంశం. భారత్ అమెరికాల మధ్య సంబంధాలు నేడు ఎంతో పరిణాత్మకమైనవిగా రెండు దేశాలూ భావిస్తున్నాయని, రెండు దేశాల ప్రయోజనాల్లో అపూర్వమైన సారూప్యత ఉందని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు.

Donald Trump India tour

The post ఎదురుచూసిన క్షణం.. విశిష్ట అతిథి విచ్చేస్తున్నాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.