మహిళా న్యాయం దిశలో సుప్రీం భేష్

  రాష్ట్రపతి కోవింద్ కితాబు అప్పటి, ఇప్పటి తీర్పులతో మేలుకొలుపులు ఆధునీకరణ, సామాన్యీకరణతో మేలు న్యూఢిల్లీ : దేశంలో లింగపరమైన న్యాయం పరిరక్షణలో భారతీయ న్యాయవ్యవస్థ విశేషరీతిలో స్పందిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ తన విద్యుక్త ధర్మాన్ని అంకితభావంతో నిర్వహిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ న్యాయవ్యవస్థ సదస్సు 2020లో రాష్ట్రపతి ఆదివారం ప్రసంగించారు. జుడిషియరీ, మారుతున్న ప్రపంచం అనే అంశంపై రాష్ట్రపతి విశ్లేషణాత్మక ప్రసంగం సాగింది. మహిళల పట వివక్షతలు లేకుండా చేసేందుకు […] The post మహిళా న్యాయం దిశలో సుప్రీం భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాష్ట్రపతి కోవింద్ కితాబు
అప్పటి, ఇప్పటి తీర్పులతో మేలుకొలుపులు
ఆధునీకరణ, సామాన్యీకరణతో మేలు

న్యూఢిల్లీ : దేశంలో లింగపరమైన న్యాయం పరిరక్షణలో భారతీయ న్యాయవ్యవస్థ విశేషరీతిలో స్పందిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ తన విద్యుక్త ధర్మాన్ని అంకితభావంతో నిర్వహిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ న్యాయవ్యవస్థ సదస్సు 2020లో రాష్ట్రపతి ఆదివారం ప్రసంగించారు. జుడిషియరీ, మారుతున్న ప్రపంచం అనే అంశంపై రాష్ట్రపతి విశ్లేషణాత్మక ప్రసంగం సాగింది. మహిళల పట వివక్షతలు లేకుండా చేసేందుకు భారత న్యాయవ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం అని ఆయన కితాబు ఇచ్చారు. స్త్రీలకు సమాన న్యాయం. ప్రత్యేకించి పనిచేసే చోట మహిళలపై వేధింపుల ఆటకట్టుకు వెలువరించిన తీర్పులు సమాజంలో సరైన వాతావరణానికి దోహదం చేశాయని తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం వివిధ కేసులలో చూపిన చొరవ స్పందన పలు సామాజిక అంశాలను ప్రభావితం చేసిందని తెలిపారు.

ఈ కోణంలో చూస్తే అభ్యుదయ సామాజిక పరివర్తనలో తనదైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆఫీసులలో, పనిచేసే చోట మహిళలపై వెకిలి చర్యల నివారణ దిశలో రెండు దశాబ్దాల క్రితం వెలువరించిన విశాఖ మార్గదర్శకసూత్రాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ మధ్యనే సైన్యంలో అత్యున్నత పదవులలోకి మహిళా అధికారులను తీసుకోవాలని, వారికి శాశ్వత కమిషన్ ప్రక్రియ ఉండాలని వెలువరించిన రూలింగ్ మైలురాయి అయిందని తెలిపారు. లింగపరమైన న్యాయం పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు గురుతర బాధ్యతలను నిర్వర్తిస్తోందన్నారు. ఈ విషయంలో ఎల్లవేళలా క్రియాశీలతతో, అంతకు మించి అభ్యదయ దృక్పథంతో వ్యవహరిస్తోందని అన్నారు. పలుచోట్ల మహిళ వివిధ స్థాయిలలో ఎదుర్కొనే లైంగిక వేధింపులకు సుప్రీంకోర్టు రూలింగ్‌తో కట్టడి ఏర్పాటు అయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్మీలో మహిళలకు సమాన హోదాలు కల్పించాలనే తీర్పు నిర్థిష్టంగా మౌలిక సామాజిక పరిణామానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.

సామాన్యునికి మరింత చేరువ
న్యాయవ్యవస్థను సామాన్యుడికి మరింత చేరువగా తీసుకువెళ్లేందుకు చేపట్టిన చర్యలు కీలకమైనవని రాష్ట్రపతి తెలిపారు. వ్యవస్థను అందుబాటులోకి తేవడం ద్వారా న్యాయం సత్వరంగా అందాల్సిన వారికి అందేందుకు వీ లేర్పడిందని ప్రశంసించారు. దేశంలో భాషాపరమైన వైవిధ్యతలను దృష్టిలో పెట్టుకుని పలు విధాలైన న్యాయసంస్కరణలకు దిగారని, వీటి వల్ల సత్ఫలితాలు కలుగుతున్నాయని తెలిపారు. పనిచేసే చోట మహిళల పట దురుసుగా వ్యవహరించే ధోరణికి అడ్డుకట్ట పడిందని రాష్ట్రపతి తెలిపారు. ఇక సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని 9 ప్రాం తీయ వాడుక భాషలలో వెలువడేలా చేయడం సామాన్య మానవీయ కోణంలో చాలా మేలు చేసిందని, తమ ప్రాం తీయ భాషలలో తీర్పులలోని అంశాలను తెలుసుకునేందుకు వీలేర్పడిందని రాష్ట్రపతి వివరించారు.

భాషా వైవిధ్యతలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న భాషాతర్జుమా అసాధారణమైనదని తెలిపారు. న్యాయవ్యవస్థకు కేంద్ర బిందువులుగా ఉండే బెంచ్ , బార్‌లు సరైన అనుసంధానంతో న్యాయకోవిదత్వంతో వ్యవహరిస్తూ తమ స్పందనలతో మేధోవిజ్ఞాన హుందాతనం పాటిస్తున్నాయని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ దిశలో ఎప్పటికప్పుడు తన మేలుకొలుపు పాత్రను పోషిస్తోందని అన్నారు. స్థిరప్రగతి, చెదరని పర్యావరణం దిశలో ఇక్కడి న్యాయవ్యవస్థ తీర్పులు, వీటి వల్ల తలెత్తుతున్న సముచిత వాతావరణం గురించి అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొందని రాష్ట్రపతి తెలిపారు.

రికార్డులు, ఫైళ్ల నిర్వహణలో ఎప్పటికప్పుడు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఉండటం వల్ల ఐటిని న్యాయప్రక్రియకు అనుసంధానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ క్రమంలో తీవ్రస్థాయి కేసుల విచారణలు సాఫీగా సాగేందుకు వీలేర్పడుతోందన్నారు. కంప్యూటరీకరణకు సుపీకోర్టులో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచి పరిణామమని, దీనితో క్రమేపీ సుప్రీంకోర్టు వ్యవహారాలు ఇకముందు కాగిత రహితం అయి, సమాచారం సత్వర వినిమయానికి దారితీస్తుందని తెలిపారు.

Indian Judiciary in protection of Gender justice

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహిళా న్యాయం దిశలో సుప్రీం భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.