అతిథి కోసం ఆగ్రా ముస్తాబు

  వీధుల్లో కటౌట్లు, రెండు దేశాల జెండాల రెపరెపలు ఆగ్రా : ప్రణయ భావానికి సంకేతంగా నిలిచిన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు ఆగ్రా అందంగా ముస్తాబైంది. గత కొన్నివారాలుగా పాలనా యంత్రాంగం ఆగ్రాను అందంగా తీర్చిదిద్దడంలో తలమునకలై ఉంది. శుభాకాంక్షల సందేశాల బిల్‌బోర్డులతో, భారత్ అమెరికా పతాకాలతో, విక్టోరియా కాలంనాటి దీప స్తంభాలతో వీధులు కొత్త అందాలు సంతరించుకున్నాయి. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సోమవారం […] The post అతిథి కోసం ఆగ్రా ముస్తాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వీధుల్లో కటౌట్లు, రెండు దేశాల జెండాల రెపరెపలు

ఆగ్రా : ప్రణయ భావానికి సంకేతంగా నిలిచిన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు ఆగ్రా అందంగా ముస్తాబైంది. గత కొన్నివారాలుగా పాలనా యంత్రాంగం ఆగ్రాను అందంగా తీర్చిదిద్దడంలో తలమునకలై ఉంది. శుభాకాంక్షల సందేశాల బిల్‌బోర్డులతో, భారత్ అమెరికా పతాకాలతో, విక్టోరియా కాలంనాటి దీప స్తంభాలతో వీధులు కొత్త అందాలు సంతరించుకున్నాయి. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంకాలం డోనాల్డ్ ట్రంప్ ఆగ్రా చేరుకుంటారు.

ఈ అపూర్వమైన సన్నివేశంకోసం ఆగ్రా కొత్తకళను సంతరించుకుంది. ఆగ్రా ఔన్నత్యాన్ని ట్రంప్‌నకు కళ్లకు కట్టేలా చూపించేందుకు అధికారులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఆగ్రా డివిజనల్ కమిషనర్ అనీల్ కుమార్ మాట్లాడుతూ సోమవారం సాయంకాలం దాదాపు 4.30 గంటలకు ట్రంప్ ఇక్కడి ఖేరియా ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్కడ ఆయనకు 350 మంది కళాకారుల బృందం అద్భుతమైన నృత్యాలతో, సంప్రదాయ సంగీత వాద్యాలతో డోనాల్డ్ ట్రంప్‌కు అలరిస్తుంది’ అన్నారు.

‘ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎయిర్‌పోర్ట్‌లో అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతారు. అయితే వారు తాజ్‌మహల్‌కు ఆయన వెంట వెళ్లరు. ’అని ఆగ్రా డిఎం ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. ఎయిర్‌పోర్టులో పెద్దపెద్ద కటౌట్లు, బిల్‌బోర్డుల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. భద్రతకోసం యుపి పోలీస్, పారా మిలిటరీ దళాలు, ఎన్‌ఎస్‌జి, పిఎసి, పోలీస్ కమెండోలను నియమించామని, మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని, దాదాపు 3,000 మంది సిబ్బంది పట్టణంలో కాపలా ఉంటారని సింగ్ వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే వాహనాల్ని తాజ్ మహల్ గేటుకు 500 మీటర్ల పరిథిలో అనుమతించలేదన్నారు.

Agra decked up to welcome Trump

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అతిథి కోసం ఆగ్రా ముస్తాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.