బాహుబలి ట్రంప్

  గొప్ప స్నేహితులను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నా భారత పర్యటనకు ముందు ఆసక్తి రేపిన ట్రంప్ ట్వీట్ వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ఒక్కరోజు ముందు ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొంది రికార్డులు కొల్లగొట్టిన బాహుబలి సినిమా టైటిల్ సాంగ్‌తో ట్రంప్‌పై రూపొందించిన ఓ వీడియో క్లిప్(మీమ్) సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాదాపు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నటుడు ప్రభాస్ ముఖానికి […] The post బాహుబలి ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గొప్ప స్నేహితులను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నా
భారత పర్యటనకు ముందు ఆసక్తి రేపిన ట్రంప్ ట్వీట్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ఒక్కరోజు ముందు ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొంది రికార్డులు కొల్లగొట్టిన బాహుబలి సినిమా టైటిల్ సాంగ్‌తో ట్రంప్‌పై రూపొందించిన ఓ వీడియో క్లిప్(మీమ్) సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాదాపు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నటుడు ప్రభాస్ ముఖానికి ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్‌గ్రౌండ్‌లో ‘జియోరే బాహుబలి’ సాంగ్‌ను పెట్టారు. దీంతో పాటు ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌ను ఆ వీడియోలో చూపించారు. అలాగే ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను తండ్రి ట్రంప్ భుజాల మీద ఎత్తుకున్నట్లు చూపించారు. ఇదే సినిమాలో ప్రభాస్ కత్తులు చేతపట్టుకుని యుద్ధ విన్యాసాలు చేయడం.. రథాన్ని నడపడం… గుర్రంపై కూర్చుని ప్రత్యర్థులను మట్టుబెట్టడం లాంటి సీన్లకు కూడా ట్రంప్ ముఖాన్ని అతికించారు.

మధ్యలో మోడీ, ఆయన భార్య జశోదా కనిపించడం విశేషం. ఇక చివర్లో సినిమాకు శుభం కార్డు లాగా ఈ వీడియోలో కూడా ‘యుఎస్‌ఏ అండ్ ఇండియా యునైటెడ్’ అని ప్రదర్శించడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ వీడియోపై ట్రంప్ స్పందించారు ‘భారత్‌లోని నా గొప్ప స్నేహితులను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నా’ అని రీట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా భారీ రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి : ది కన్‌క్లూజన్‌గా రెండు భాగాలతో వచ్చిన ఈ సినిమా భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి సిరీస్ దాదాపు 2వేల కోట్లకు పైగా రికార్డు కలెక్షన్స్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.

Trump shares video of him as Baahubali before India visit

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాహుబలి ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.