భారత్ బైలెల్లిన ట్రంప్

  ఎన్నాళ్ల నుంచో భారత్‌ను చూడాలని ఉంది.. ఇప్పుడొస్తున్నా పర్యటనకు ముందు మీడియాతో ట్రంప్ వాషింగ్టన్ : చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారతదేశ పర్యటనకు వెళ్లుతున్నానని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ తెలిపారు. భారత్‌లో 36 గంటల తొలి అధికారిక పర్యటనకు ఆదివారం రాత్రి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరారు. భార్య, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా, కూతురు ఇవాంక, అల్లుడు జోరెడ్ కుష్నెర్ దంపతులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో ఆయన భారత్‌కు వస్తున్నారు. […] The post భారత్ బైలెల్లిన ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎన్నాళ్ల నుంచో భారత్‌ను చూడాలని ఉంది.. ఇప్పుడొస్తున్నా
పర్యటనకు ముందు మీడియాతో ట్రంప్

వాషింగ్టన్ : చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారతదేశ పర్యటనకు వెళ్లుతున్నానని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ తెలిపారు. భారత్‌లో 36 గంటల తొలి అధికారిక పర్యటనకు ఆదివారం రాత్రి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరారు. భార్య, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా, కూతురు ఇవాంక, అల్లుడు జోరెడ్ కుష్నెర్ దంపతులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో ఆయన భారత్‌కు వస్తున్నారు. తన ప్రత్యేక విమానంలో వేళ్లేందుకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడు అని, ఆయనతో పలు విషయాపై చర్చించేందుకు, కోట్లాది మందితో కూడిన జనభారత్‌ను సందర్శించేందుకు తాను వెళ్లుతున్నట్లు తెలిపారు.

భారత్‌కు ఇది తన తొలి పర్యటన అని, నిజానికి ఎంతోకాలం నుంచి తనకు భారత్‌లో పర్యటించాలనే ఆలోచన ఉందని చెప్పారు. ఇప్పుడు భారతీయులతో గడిపేందుకు వెళ్లే సమయం దక్కిందన్నారు. వేలు లక్షలు కాదు, కోట్లాది మంది భారతీయులను చూడటానికి వెళ్లుతున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఇది విశాల పర్యటన అని అభివర్ణించారు. ప్రధాని మోడీతో తనకు మంచి అనుబంధం ఉందని, నిజమైన తన స్నేహితుడని వైట్‌హౌస్ వెలుపల గుమికూడిన విలేకరుల వద్ద కొనియాడారు. తన పర్యటనలో భాగంగా భారీ స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. భారత్‌లో ఎప్పుడూ ఎక్కడా జరగని విశేష కార్యక్రమంగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

తనకైతే ఎంతో అద్భుతం అన్పిస్తోందని, ఇక్కడైతే జనం వేలల్లో వస్తారని, అయితే భారతదేశ జనాభా నేపథ్యంలో చూస్తే కనీసం కోటి మంది వరకైనా తన సభకు రావచ్చునని అనుకుంటున్నట్లు, ఇదైతే తనకు చిరస్మరణీయమే అవుతుందని అన్నారు. తాను భారత్‌లొ ఒక్క రాత్రి బస చేయనున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. ప్రెసిడెంట్ ప్రత్యేక విమానం జర్మనీలో కొద్ది సేపు ఇంధన రీచార్జీకి నిలుస్తుంది. తరువాత ఇండియాకు బయలుదేరుతుంది. భారత్‌లో అమెరికా అధినేత పర్యటనకు విశేష రాజకీయ భౌగోళిక ప్రాధాన్యత ఏర్పడింది. కేవలం 36 గంటల పర్యటననే అయినా ఇది కలకాలపు ప్రభావం కల్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాసియా, దాని వెలుపలి, అంతకు మించి ప్రపంచ స్థాయి పరిణామాలు, ప్రధాన రాజకీయప్రాదేశిక పరిణామాలపై ఇరువురు నేతలు దృష్టిసారిస్తారు.

American President Donald Trump leaves for India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్ బైలెల్లిన ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.