‘నమస్తే ట్రంప్’కు రెడీ

  ఫిబ్రవరి 25 ఉ.10.00గం.కు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.30గం.కు రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళి 11.00 హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో భేటీ, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు. 12.00 ఒప్పందాలపై సంతకాలు, మీడియా సమావేశం. 7.30 రాష్ట్రపతి భవన్‌లో రాంనాథ్ కోవింద్‌తో భేటీ, విందు 10.00 ట్రంప్ దంపతులు అమెరికా తిరుగుపయనం. అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు సోమవారం ఘనస్వాగతం పలికేందుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ అన్నివిధాలా […] The post ‘నమస్తే ట్రంప్’కు రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఫిబ్రవరి 25
ఉ.10.00గం.కు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు.
10.30గం.కు రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళి
11.00 హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో భేటీ, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు.
12.00 ఒప్పందాలపై సంతకాలు, మీడియా సమావేశం.
7.30 రాష్ట్రపతి భవన్‌లో రాంనాథ్ కోవింద్‌తో భేటీ, విందు
10.00 ట్రంప్ దంపతులు అమెరికా తిరుగుపయనం.

అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు సోమవారం ఘనస్వాగతం పలికేందుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ అన్నివిధాలా సమాయత్తమైంది. సోమవారం ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 22 కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్ షో సాగుతుంది. ఈ రోడ్ షో ప్రజలు, విఐపిలకు ఒక తీపి గుర్తుగా మిగిలేందుకు నగర పాలక వ్యవస్థ అన్ని ఏర్పాట్లూ చేసింది. దీనికి ‘ఇండియా రోడ్ షో’ అని పేరుపెట్టింది. ట్రంప్ పర్యటనకోసం అధికారులు, భద్రతా సంస్థలు నగరానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. రోడ్ షో సందర్భంగా ట్రంప్ ప్రధాని మోడీతో కలిసి సబర్మతి ఆశ్రమానికి రాబోతున్నారు. అందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశామని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ఆదివారం ట్వీట్ చేశారు.

1.10 లక్షలమందికి అవకాశం..
రోడ్ షో తర్వాత మోటేరా స్టేడియంలో భారీ ఎత్తున జరిగే ‘నమస్తే ట్రంప్’ సభలో ప్రధాని మోడీ, ట్రంప్ కలిసి ప్రసంగిస్తారు. ఈ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అది పెద్దది. 1.10 లక్షలమంది ఈ స్టేడియంలో కూచునే అవకాశం ఉంది. 1982లో కట్టిన ఈ స్టేడియంను ఇప్పుడు పూర్తిగా పునర్నిర్మించారు. మోడీ, ట్రంప్ ప్రసంగించడానికి ముందు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ గాయకుడు కైలేష్ ఖేర్, మరెందరో కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రత్యేక భద్రత..
రోడ్‌షోకోసం, ఆ తర్వాత నమస్తే ట్రంప్ కార్యక్రమం కోసం 25 మంది సీనియర్ ఐపిఎస్ అధికారుల నేతృత్వంలో దాదాపు 10,000కు పైగా భద్రతా సిబ్బందిని నియమించినట్టు సిటీ పోలీస్ వ్యవస్థ తెలిపింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రతా సిబ్బంది కాక వీరు అదనం. అంతేకాక, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్.ఎస్.జి), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎప్‌పిజి) కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాయి. ట్రంప్ పర్యటించే మార్గంలో ఎలాంటి అనుమానిత డ్రోన్‌లు లేకుండా యాంటి డ్రోన్ టెక్నాలజీని పోలీసులు అమలు చేస్తున్నారని అధికారులు తెలిపారు.

గుజరాతీ వంటకాలతో ఆతిథ్యం

ట్రంప్ దంపతులకు నోరూరించే ‘ఖమాన్’

అహ్మదాబాద్ : భారతదేశ పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన భార్య అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఇక్కడ గుజరాతీ వంటకాల్ని తేనీటి విందులో రుచి చూస్తారు. చవులూరించే ప్రసిద్ధ గుజరాతీ డిష్ ‘ఖమాన్’ను ట్రంప్ దంపతుల మెనూలో చేర్చారు. ఒక్క ఖమాన్ మాత్రమే కాక, అమెరికా నుంచి వచ్చే అత్యంత ప్రముఖ బృందానికి బ్రొక్కోలీ, కార్న్ సమోసా, ఆపిల్ పీ, కాజూ కతిల్, వివిధ రకాల తేనీటిని ఏర్పాటు చేశామని అహ్మదాబాద్ ఫార్చూన్ లాండ్‌మార్క్ హోటల్ చెఫ్ సురేష్ ఖన్నా చెప్పారు. చెఫ్‌గా ఎంతో పేరున్న ఖన్నాకు ట్రంప్‌కు, ఆయన బృందం సోమవారం మధ్యాహ్నం సబర్మతి ఆశ్రమం సందర్శించే సమయంలో రుచికరమైన ఆహారాన్ని తయారుచేసే బాధ్యతను అప్పగించారు. ‘రేపు మాకు ఫార్చూన్ లాండ్ మార్క్ హోటల్‌లో చాలా ముఖ్యమైన రోజు. మేము వారికోసం ఉన్నతస్థాయి టీ మెనూను తయారు చేశాం. ఖమాన్ అనేది ప్రసిద్ధి చెందిన గుజరాతీ వంటకం. మేము ట్రంప్‌కోసం తేలికపాటి ఆవిరితో చేసే ఖమాన్ అందిస్తాం’ అని ఖన్నా విలేకరులకు చెప్పారు.

Motera Stadium gets ready for Namaste Trump event

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘నమస్తే ట్రంప్’కు రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.