ట్రంప్‌కు ఆగ్రా తాళంచెవి

  ట్రంప్ ఆగ్రా పర్యటన సందర్భంగా నగర మేయర్ ఆగ్రా నగరం తాళం చెవిని ట్రంప్‌కు బహూకరించనున్నట్టు తెలిసింది. 12 అంగుళాలు పొడవుండే ఈ తాళం చెవి పూర్తిగా వెండితో తయారవుతోందట. దానిపై తాజ్‌మహల్ చిత్రంతో పాటు, ‘వెలకమ్ టూ ఆగ్రా, ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్’ అనే పదాలు ఉంటాయని సమాచారం. అధ్యక్షుడికి ఇటువంటి తాళం చెవి బహూకరించడం వెన ఉన్న ప్రాశస్త్యాన్ని మేయర్ ఇలా వివరించారు. ‘ఆగ్రా నగరానికి ఓ సాంప్రదాయం ఉంది. ప్రముఖ విదేశీ […] The post ట్రంప్‌కు ఆగ్రా తాళంచెవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ట్రంప్ ఆగ్రా పర్యటన సందర్భంగా నగర మేయర్ ఆగ్రా నగరం తాళం చెవిని ట్రంప్‌కు బహూకరించనున్నట్టు తెలిసింది. 12 అంగుళాలు పొడవుండే ఈ తాళం చెవి పూర్తిగా వెండితో తయారవుతోందట. దానిపై తాజ్‌మహల్ చిత్రంతో పాటు, ‘వెలకమ్ టూ ఆగ్రా, ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్’ అనే పదాలు ఉంటాయని సమాచారం. అధ్యక్షుడికి ఇటువంటి తాళం చెవి బహూకరించడం వెన ఉన్న ప్రాశస్త్యాన్ని మేయర్ ఇలా వివరించారు. ‘ఆగ్రా నగరానికి ఓ సాంప్రదాయం ఉంది. ప్రముఖ విదేశీ అతిథులు ఎవరైనా నగరానికి వచ్చినప్పుడు వారికి ఓ తాళం చెవి బహూకరిస్తాం. ఇది ఆగ్రా నగరానికి చెందిన తాళం చెవి. దీని సహాయంతో ఆగ్రా నగరం తలుపులు తెరిచి లోనికి ప్రవేశించాలని అతిథికి సూచిస్తాం. ఈ తాళం చెవి బరువుకు 600 గ్రాములు. ఇది తాజ్‌మహల్‌ను పోలి ఉంటుంది.’ అంటూ ఆ సంప్రదాయం గొప్పదనాన్ని వివరించారు.

Trump to be gifted silver Key to Agra during Taj Mahal visit

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ట్రంప్‌కు ఆగ్రా తాళంచెవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: