మతస్వేచ్ఛకు కట్టుబడ్డారా?

  సిఎఎపై మోడీతో ట్రంప్ పరోక్ష ప్రస్తావన : వైట్‌హౌస్ వర్గాలు రేపు భారత్‌కు అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ : భారత్‌లో మతస్వేచ్ఛ అంశం గురించి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీతో మాట్లాడుతారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. సోమవారం నుంచి ట్రంప్ భారతదేశంలో రెండు రోజుల పా టు అధికారిక పర్యటనకు వస్తున్నారు. భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియ, వ్యవస్థల పట్ల అమెరికాకు అపార గౌరవం ఉందని ప్రతినిధి తెలిపారు. అయితే […] The post మతస్వేచ్ఛకు కట్టుబడ్డారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిఎఎపై మోడీతో ట్రంప్ పరోక్ష
ప్రస్తావన : వైట్‌హౌస్ వర్గాలు
రేపు భారత్‌కు అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్ : భారత్‌లో మతస్వేచ్ఛ అంశం గురించి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీతో మాట్లాడుతారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. సోమవారం నుంచి ట్రంప్ భారతదేశంలో రెండు రోజుల పా టు అధికారిక పర్యటనకు వస్తున్నారు. భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియ, వ్యవస్థల పట్ల అమెరికాకు అపార గౌరవం ఉందని ప్రతినిధి తెలిపారు. అయితే మత స్వేచ్ఛ పరిరక్షణ అంశం ట్రంప్ దృష్టిలో మరింత కీలకం అని వెల్లడించారు. భారతదేశంలో ఇప్పుడు వివాదాస్పదం అయి న సిఎఎ, ఎన్‌ఆర్‌సిలపై మోడీతో ట్రంప్ మాట్లాడుతారా? అని విలేకరులు ప్రశ్నించారు. అయితే దీనికి నేరుగా వైట్‌హౌస్ అధికారులు సమాధానం ఇవ్వలేదు. మతస్వేచ్ఛ, వివక్షతల విమర్శల గురించి మోడీతో ప్రస్తావించే అవకాశం ఉందని తెలిపారు. భారత్, అమెరికాలకు ఉమ్మడిగా సారూప్య ప్రజాస్వామిక సాంప్రదాయక విలువలు ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో మతస్వేచ్ఛపై అమెరికా రాజీపడే అవకాశం లేదన్నారు.

ప్రతినిధి బృందాల స్థాయి భేటీలు, బహిరంగ వ్యాఖ్యలు, ఆంతరంగిక చర్చల దశలో ఈ మతస్వేచ్ఛ అంశాన్ని ట్రంప్ తప్పనిసరిగా ప్రస్తావిస్తారని స్పష్టం చేశారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సిల ప్రక్రియలతో ఒక మతవర్గానికి చేటు కల్గుతుందని, మతస్వేచ్ఛకు ప్రతిబంధకాలు ఏర్పడుతాయని విమర్శలు వెలువడుతున్నాయి. భారతదేశంలో ఈ ప్రక్రియలకు నిరసనగా పలు చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. వర్తమాన భారతదేశంలో రగులుకుంటున్న సమస్య, దీనితో ఇమిడి ఉన్న మతపరమైన అంశాలను ట్రంప్ ప్రధాని మోడీ వద్ద ప్రస్తావిస్తారని వెల్లడైంది. సార్వత్రిక ఉమ్మడి విలువలు, చట్టపరమైన పాలనకు కట్టుబడి రెండు దేశాలూ పనిచేస్తున్నాయని ప్రతినిధి తెలిపారు. ఆచరించే ప్రజాస్వామిక సంప్రదాయాలకు భారత్ కట్టుబడి ఉండేలా ఎల్లవేళలా అమెరికా తోడ్పాటు అందిస్తూనే ఉంటుందన్నారు.

భారత్‌లో ప్రస్తుతం తలెత్తిన కొన్ని అంశాలపై తాము ఆందోళన చెందుతున్నట్లు అమెరికా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే సిఎఎ, ఎన్‌ఆర్‌సిల గురించి నేరుగా ప్రస్తావించలేదు. భారతదేశం తమ విలువల నుంచి వైదొలగదనే భావిస్తున్నట్లు , ప్రపంచ మంతా ఇదే ఆశిస్తోందన్నారు. మతస్వేచ్ఛ, మతపరమైన మైనార్టీల పట్ల ఆదరణ, వారి రక్షణ వంటివి భారత రాజ్యాంగంలో ఉండనే ఉన్నాయని ఈ ప్రతినిధి తమ పేరు వెల్లడించకుండా తెలిపారు. భారతదేశం ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉంది. మతభాష, సాంస్కృతిక వైవిధ్యతలకు నిలయంగా ఉందని అభిప్రాయపడ్డారు. భారతదేశం నిజానికి నాలుగు ప్రధాన మతాల పుట్టిల్లు అని కూడా తెలిపారు.

Trump may raise CAA, NRC issue in talks with PM Modi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మతస్వేచ్ఛకు కట్టుబడ్డారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: