ఆ బ్యాంకులను పర్యవేక్షిస్తున్నాం

  ప్రస్తుతం పిసిఎ ఆంక్షలు ఎదుర్కొంటున్నవి నాలుగు అవి ఐఒబి, సిబిఐ, యుకో బ్యాంక్, యుబిఐ వాటి పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం పిసిఎ నుంచి త్వరగా బయటపడాలని ఆశిస్తున్నాం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ న్యూఢిల్లీ : పిసిఎ(తక్షణ దిద్దుబాటు చర్య) ఆంక్షలు ఎదుర్కొంటున్న బ్యాంకులను పర్యవేక్షిస్తున్నామని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నామని అన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఒబి), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ […] The post ఆ బ్యాంకులను పర్యవేక్షిస్తున్నాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రస్తుతం పిసిఎ ఆంక్షలు ఎదుర్కొంటున్నవి నాలుగు
అవి ఐఒబి, సిబిఐ, యుకో బ్యాంక్, యుబిఐ
వాటి పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం
పిసిఎ నుంచి త్వరగా బయటపడాలని ఆశిస్తున్నాం
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్

న్యూఢిల్లీ : పిసిఎ(తక్షణ దిద్దుబాటు చర్య) ఆంక్షలు ఎదుర్కొంటున్న బ్యాంకులను పర్యవేక్షిస్తున్నామని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నామని అన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఒబి), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిబిఐ), యుకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి నాలుగు బ్యాంకులు ఈ ఆంక్షల పరిధిలో ఉన్నాయి. పిసిఎ కింద ఈ నాలుగు బ్యాంకుల రుణ, నిర్వహణ పరిహారం, మార్గనిర్దేశకుల ఫీజు వంటి వాటిపై ఆంక్షలు ఉన్నాయి. శనివారం శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ, ఈ బ్యాంకులు తమ పనితీరును మెరుగుపర్చుకునేందుకు ప్రోత్సహిస్తున్నామని, వీలైనంత త్వరగా పిసిఎ పరిధి నుంచి బయటపడాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఈ నాలుగు బ్యాంకులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నామని, వాటిని పర్యవేక్షిస్తున్నామని, అవి ప్రయత్నాలు చేస్తున్నాయని దాస్ వివరించారు. పిసిఎ ఆంక్షల నుంచి బయటపడేందుకు ఈ బ్యాంకులు పలు చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ నాలుగు బ్యాంకులకు దాదాపు రూ.11,521 కోట్లు మూలధనం అందజేసింది. వీటిలో ఐఒబి ఎక్కువగా రూ.4,360 కోట్లు పొందింది. ఇకా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3,353 కోట్లు, యుకో బ్యాంక్ రూ.2,142 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,666 కోట్లు పొందాయి. వీటితో పాటు డిసెంబర్‌లో పార్లమెంట్‌చే అనుమతి పొందడం ద్వారా ఎల్‌ఐసి ఆధారిత ఐడిబిఐ బ్యాంక్ కూడా అదనపు మూలధనం రూ.4,557 కోట్లు పొందింది.

ఐదు బ్యాంకులు పిసిఎ నుంచి తొలగింపు..
గతేడాది ఆర్‌బిఐ ఐదు బ్యాంకులు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను పిసిఎ పరిధి నుంచి తొలగించింది. ప్రభుత్వం నుంచి మూలధనం ప్రకటన తర్వాత పనితీరు మెరుగవడంతో రెండు దఫాలుగా ఈ బ్యాంకులను పిసిఎ నుంచి తొలగించారు. మూలధనం జొప్పించడం ఈ బ్యాంకులకు కలిసివచ్చింది. దీంతో వాటి ఎన్‌పిఎ లేదా మొండి బకాయిలు 6 శాతం దిగువకు చేరడంతో పనితీరు మెరుగైంది.

దేనా బ్యాంక్‌ను కూడా..
గత ఏడాది పిసిఎ నిబంధనలను ఎదుర్కొంటున్న మొత్తం 11 బ్యాంకులకు గాను దేనా బ్యాంక్‌ను ఈ జాబితా నుంచి తొలగించారు. దీనికి కారణం ఏప్రిల్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం కావడమే. మరోవైపు ఐడిబిఐ బ్యాంక్‌ను ఎల్‌ఐసి స్వాధీనం చేసుకుంది.

విలీనంతో ప్రభావం..
ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల మెగా విలీనం చేపట్టింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు విలీనం ప్రభావం పడకుండా తమతమ కార్యకలాపాలకు అంతరాయం కల్గకుండా జాగ్రత్త వహించాలని దాస్ సూచించారు. విలీనం ప్రక్రియ కారణంగా బ్యాంకుల రుణాలు, ఇతర కార్యకలాపాల్లో ప్రభావం పడుతుంది. అందువల్ల తాము బ్యాంకుల పనితీరును పర్యవేక్షిస్తున్నామని అన్నారు.

నాలుగు మెగా విలీనాలు..
గతేడాది ఆగస్టులో కేంద్రం నాలుగు మెగా పిఎస్‌యు బ్యాంకుల్లో దాదాపు 10 ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. దీని ప్రకారం, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అవుతాయి. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ కానుంది. అలాగే ఇండియన్ బ్యాంక్‌తో కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులు విలీనం అవుతాయి. మరోవైపు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు విలీనం అవుతాయి. 2019 ఏఫ్రిల్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లను కలిపారు. ఇక దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్‌బిఐలో ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేశారు. అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లతో పాటు భారతీయ మహిళా బ్యాంక్‌లను ఎస్‌బిఐలో కలిపిన విషయం తెలిసిందే.

Efforts of banks under PCA framework being monitored

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ బ్యాంకులను పర్యవేక్షిస్తున్నాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: