మాకు కోహ్లీ కావాలి

  బిసిసిఐని కోరుతున్న బంగ్లా క్రికెట్ బోర్డు నేడు తుది నిర్ణయం తీసుకోనున్న బిసిసిఐ ముజిబుర్ రెహమాన్ శతజయంతి సందర్భంగా ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య టి20 మ్యాచ్‌లకు సన్నాహాలు ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతజయంతి సందర్భంగా వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్లు మధ్య రెండు టి20 మ్యాచ్‌లు నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు (బిసిబి) ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంకా […] The post మాకు కోహ్లీ కావాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బిసిసిఐని కోరుతున్న బంగ్లా క్రికెట్ బోర్డు
నేడు తుది నిర్ణయం తీసుకోనున్న బిసిసిఐ
ముజిబుర్ రెహమాన్ శతజయంతి సందర్భంగా ఆసియా ఎలెవన్,
వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య టి20 మ్యాచ్‌లకు సన్నాహాలు

ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతజయంతి సందర్భంగా వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్లు మధ్య రెండు టి20 మ్యాచ్‌లు నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు (బిసిబి) ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంకా షెడ్యూల్, ఆటగాళ్ల పూర్తి వివరాలు ఖరారు చేయాల్సి ఉండడంతో ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. మార్చి 18 22తేదీల మధ్య ఈ రెండు మ్యాచ్‌లను నిర్వహించాలని బంగ్లాదేశ్ యోచిస్తోంది. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ఆసియా ఎలెవన్‌లో ఉండాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. ‘ మేము షెడ్యూల్, ఆటగాళ్ల లభ్యతపై కసరత్తు చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేము ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు( బిసిసిఐ)తో టచ్‌లో ఉన్నాం. భారత్‌నుంచి ఏ అటగాళ్లు అందుబాటులో ఉంటారో వివరణ కోరాం.

కాకపోతే విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉండాలని బిసిసిఐకి విజ్ఞప్తి చేశాం. దీనిపై బిసిసిఐ కూడా సానుకూలంగా స్పందించింది. కోహ్లీతో మాట్లాడిన తర్వాత మాకు సందేశం పంపవచ్చు. ఈ రెండు టి20ల సిరీస్‌లో కోహ్లీ తప్పక ఉంటాడనే భావిస్తున్నాం’ అని బిసిబి తెలిపింది. కాగా భారత్‌నుంచి నలుగురైదుగురు ఆటగాళ్లను ఆసియా ఎలెవన్ తరఫున ఆడడానికి పంపించేందుకు సిద్ధమవుతున్న విషయాన్ని బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఆ క్రికెటర్ల పేర్లు ఇంకా ఖరారు కాలేదన్నాడు. ఆదివారం జరిగే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బిసిబి అభ్యర్థనపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా విరాట్ కోహ్లీతో చర్చించాలని బిసిసిఐ భావిస్తోంది.

Bangla Cricket Board wants Kohli

The post మాకు కోహ్లీ కావాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: