డారెన్ సామికి పాక్ గౌరవ పౌరసత్వం

  డారెన్ సామికి పాక్ గౌరవ పౌరసత్వం పాక్ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్న విండీస్ క్రికెటర్ కరాచి: తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌కు పునరుజ్జీవం కల్పించడానికి పాకిస్థాన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ డారెల్ సామికి గౌరవ పౌరసత్వం కల్పించనుంది. పాక్ క్రికెట్ పునర్వైభవం కోసం అతను చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇలా చేస్తున్నామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) శనివారం తెలిపింది. డారెన్ సామి ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ […] The post డారెన్ సామికి పాక్ గౌరవ పౌరసత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డారెన్ సామికి పాక్ గౌరవ పౌరసత్వం
పాక్ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్న విండీస్ క్రికెటర్

కరాచి: తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌కు పునరుజ్జీవం కల్పించడానికి పాకిస్థాన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ డారెల్ సామికి గౌరవ పౌరసత్వం కల్పించనుంది. పాక్ క్రికెట్ పునర్వైభవం కోసం అతను చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇలా చేస్తున్నామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) శనివారం తెలిపింది. డారెన్ సామి ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మి జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి మార్చి 23న సామికి గౌరవ పౌరసత్వంతో పాటుగా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘నిషాన్ ఇ హైదర్’ను అందించనున్నారు.

భద్రతా కారణాల దృష్టా అంతర్జాతీయ క్రికెటర్లందరూ పాక్‌లో ఆడడానికి నిరాకరిస్తున్న తరుణంలో సామి ధైర్యం చేసి 2017లో అక్కడ పిఎస్‌ఎల్ ఫైనల్ ఆడాడు. పాకిస్థాన్ క్రికెట్‌కు సామి చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతనికి గౌరవ పౌరసత్వం ఇవ్వాలని తాము అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశామని పెషావర్ జల్మి జట్టు యజమాని జావేద్ అఫ్రిది అన్నారు. 2017 వన్డే ప్రపంచకప్ తర్వాత మాథ్యూ హేడన్ (ఆస్ట్రేలియా),ఫర్షల్ గిబ్స్( దక్షిణాఫ్రికా)లకు సెయింట్ కిట్స్‌గౌరవ పౌరసత్వం అందించింది. ఆ తర్వాత ఇలాంటి గౌరవాన్ని అందుకుంటున్న మూడో క్రికెటర్ సామినే. విండీస్‌కు రెండు టి20 ప్రపంచకప్‌లు అందించిన డారెల్ సామి పాకిస్థాన్‌లోనూ ప్రముఖుడే.

Honorary Citizenship of Pakistan for Darren Sammy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డారెన్ సామికి పాక్ గౌరవ పౌరసత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: