షా పర్యటనకు చైనా అభ్యంతరం

  తీవ్రంగా ఖండించిన భారత్ న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి గురువారం కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటించడంపై చైనా అభ్యంతరం చెప్పడాన్ని భారత్ గురువారం తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో వేరు కాని ఒక సమగ్ర భాగమని, ఇతర రాష్ట్రాల్లో పర్యటించే విధంగానే అక్కడ కూడా కేంద్ర మంత్రులు అధికారులు పర్యటించడం పరిపాటిగా వస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ […] The post షా పర్యటనకు చైనా అభ్యంతరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తీవ్రంగా ఖండించిన భారత్

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి గురువారం కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటించడంపై చైనా అభ్యంతరం చెప్పడాన్ని భారత్ గురువారం తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో వేరు కాని ఒక సమగ్ర భాగమని, ఇతర రాష్ట్రాల్లో పర్యటించే విధంగానే అక్కడ కూడా కేంద్ర మంత్రులు అధికారులు పర్యటించడం పరిపాటిగా వస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని, అక్కడ అమిత్‌షా పర్యటించడం తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని చైనా వ్యాఖ్యానించింది. ఈ విధంగా స్వదేశ రాష్ట్రంలో నేతల పర్యటనను చైనా అడ్డుకోవడంలో అర్థం లేదని కుమార్ ధ్వజమెత్తారు.

India strongly rejects China objection to Amit Shah visiting

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post షా పర్యటనకు చైనా అభ్యంతరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: