విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్

  న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ విడాకులు తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్ నవీన్ జైహింద్ 39) నుంచి ఆమె విడిపోయారు. స్వాతి మలివాల్ దేశంలోనే అత్యంత పిన్న వయసులో మహిళా కమిషన్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భర్తకు విడాకులిచ్చినట్లు బుధవారం ప్రకటించిన ఆమె దంపతులుగా కలిసుండటంలో, విడిపోవాలనుకున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. ఘజియాబాద్ లో […] The post విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ విడాకులు తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్ నవీన్ జైహింద్ 39) నుంచి ఆమె విడిపోయారు. స్వాతి మలివాల్ దేశంలోనే అత్యంత పిన్న వయసులో మహిళా కమిషన్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భర్తకు విడాకులిచ్చినట్లు బుధవారం ప్రకటించిన ఆమె దంపతులుగా కలిసుండటంలో, విడిపోవాలనుకున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు.

ఘజియాబాద్ లో పుట్టిపెరిగిన స్వాతి, ఢిల్లీలోని ప్రఖ్యాత జెఎస్‌ఎస్ కాలేజీలో ఐటీలో డిగ్రీ చేశారు. అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె భాగం పంచుకున్నారు. ఆ ఉద్యమంలోనే ఆమెకు నవీన్ జైహింద్ తో పరిచయం, ప్రేమగా మారింది. పెళ్లి తర్వాత ఇద్దరూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ హర్యానా విభాగానికి నవీన్ కన్వీనర్ కాగా, ఢిల్లీలో ఎంఎల్‌ఎ టికెట్ రాక కావడంతో స్వాతికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది.

Delhi Women Panel Chief Swati Maliwal On Divorce

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: