జర్మనీలో ఉన్మాది కాల్పులు, 9 మంది మృతి

  హనాయు : జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్ సబర్బ్‌లో బుధవారం రాత్రి 43 ఏళ్ల జర్మన్ ఉన్మాది అనేక సార్లు కాల్పులకు పాల్పడడంతో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దుండగుడు మొదట సెంట్రల్ హనాయులో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హుక్కా బార్‌పై దాడి చేసి అనేక కాల్పులు సాగించాడు. ఆ తరువాత 2.5 కిమీ దూరంలో పశ్చిమ వైపు కాల్పులు సాగించాడు. ప్రత్యక్ష సాక్షాలు, వీడియో దృశ్యాల బట్టి దుండగుడు కారుపై తన […] The post జర్మనీలో ఉన్మాది కాల్పులు, 9 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హనాయు : జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్ సబర్బ్‌లో బుధవారం రాత్రి 43 ఏళ్ల జర్మన్ ఉన్మాది అనేక సార్లు కాల్పులకు పాల్పడడంతో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దుండగుడు మొదట సెంట్రల్ హనాయులో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హుక్కా బార్‌పై దాడి చేసి అనేక కాల్పులు సాగించాడు. ఆ తరువాత 2.5 కిమీ దూరంలో పశ్చిమ వైపు కాల్పులు సాగించాడు. ప్రత్యక్ష సాక్షాలు, వీడియో దృశ్యాల బట్టి దుండగుడు కారుపై తన ఇంటికి వేగంగా వెళ్లి తన 72 ఏళ్ల తల్లి వద్ద మృతుడై కనిపించాడని హెస్సే రాష్ట్ర అంతర్గత వ్యవహారాల మంత్రి పీటర్ బ్యూయెత్ చెప్పారు. దుండగుని వెబ్‌సైట్ పేజీని పరిశీలించగా నిందితుడు మానసిక ఉన్మాదిగా తెలుస్తోందని ఆయన తెలిపారు. ఇది తమ శాంతియుత స్వేచ్ఛా సమాజంపై జాతి విద్వేష దాడిగా ఆయన పేర్కొన్నారు. నిందితుడు హనాయులో 1977 లో జన్మించాడు. బ్యాంకులో శిక్షణ పొంది 2007 లో బిజినెస్ డిగ్రీ పూర్తి చేశాడు. బాధితుల్లో కొందరు టర్కీ దేశస్థులని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లెట్ కెవుసొగ్లు చెప్పారు.

9 killed at two shisha bars in Germany Shooting

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జర్మనీలో ఉన్మాది కాల్పులు, 9 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: