సుప్రీం తీర్పుతో మహిళలకు న్యాయం

  న్యూఢిల్లీ : సైన్యంలోని మహిళా అధికారులకు అత్యున్నత హోదా కల్పనపై సుప్రీంకోర్టు తీర్పును భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణే స్వాగతించారు. మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, వారికి కమాండ్ పోస్టింగ్‌లు ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో సైన్యంలో మహిళలకు సముచిత న్యాయం దిశలో సాగాలనే తమ చర్యలపై మరింత స్పష్టత ఏర్పడుతుందన్నారు. భారత సైన్యంలో వివక్షత లేదని, మతం కులం, తెగ లేదా లింగభేదం వంటివి ఉండవని అన్నారు. […] The post సుప్రీం తీర్పుతో మహిళలకు న్యాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : సైన్యంలోని మహిళా అధికారులకు అత్యున్నత హోదా కల్పనపై సుప్రీంకోర్టు తీర్పును భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణే స్వాగతించారు. మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, వారికి కమాండ్ పోస్టింగ్‌లు ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో సైన్యంలో మహిళలకు సముచిత న్యాయం దిశలో సాగాలనే తమ చర్యలపై మరింత స్పష్టత ఏర్పడుతుందన్నారు.

భారత సైన్యంలో వివక్షత లేదని, మతం కులం, తెగ లేదా లింగభేదం వంటివి ఉండవని అన్నారు. ఆది నుంచి భారతీయ సైనిక విభాగంలో ఇదే దృక్పథం ఉందని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే ఆర్మీలో 1993 నుంచే మహిళా అధికారు ఎంపిక జరుగుతూ వస్తోందని, ఈ విధమైన సమానత్వ ప్రక్రియ మరింత బలోపేతం అయ్యేలా సుప్రీంకోర్టు తీర్పు ఉందని సైనిక దళాల ప్రధానాధికారి హర్షం వ్యక్తం చేశారు. అన్ని స్థాయిలలో మహిళలను తీసుకునే చర్యలు చేపట్టినట్లు, వంద మంది మహిళా సైనికుల తొలి బ్యాచ్ శిక్షణ పొందుతోందని వివరించారు.

Army chief Naravane welcomes Supreme Court verdict

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సుప్రీం తీర్పుతో మహిళలకు న్యాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: