ట్రంప్ బలగం వస్తోంది..

  ఇప్పటికే భారత్ చేరుకున్న భద్రతా సిబ్బంది అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయిన ప్రత్యేక హెలికాప్టర్ మెరైన్ ఒన్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటిసారి భారతదేశంలో అధికారికంగా పర్యటించడాన్ని పురస్కరించుకొని ఆయన అధికారిక హెలికాప్టర్ మెరైన్ వన్ గుజరాత్ చేరుకుంది. అహ్మదాబాద్‌లోని మొటేరా క్రికెట్ స్టేడియం నుంచి ట్రంప్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తారని భావిస్తున్నారు. అక్కడి నుంచి అమెరికా అధ్యక్షుడు తాజ్‌మహల్ చూసేందుకు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఆగ్రా వెడతారు. […] The post ట్రంప్ బలగం వస్తోంది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇప్పటికే భారత్ చేరుకున్న భద్రతా సిబ్బంది
అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయిన ప్రత్యేక హెలికాప్టర్ మెరైన్ ఒన్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటిసారి భారతదేశంలో అధికారికంగా పర్యటించడాన్ని పురస్కరించుకొని ఆయన అధికారిక హెలికాప్టర్ మెరైన్ వన్ గుజరాత్ చేరుకుంది. అహ్మదాబాద్‌లోని మొటేరా క్రికెట్ స్టేడియం నుంచి ట్రంప్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తారని భావిస్తున్నారు. అక్కడి నుంచి అమెరికా అధ్యక్షుడు తాజ్‌మహల్ చూసేందుకు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఆగ్రా వెడతారు. ట్రంప్ పర్యటనకోసం ఇంతకు ముందే కార్లు, భద్రతా పరికరాలతో యుఎస్ హెర్కులెస్ విమానం గుజరాత్ చేరుకుంది. అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక ప్రయాణ సదుపాయాలకోసం అదివరకు అత్యధిక వ్యయం అయ్యే మోటార్‌కేడ్స్ ఉపయోగించేవారు. ఇప్పుడు దానిబదులు మెరైన్ వన్ ను వాడుతున్నారు. ఇది అత్యంత శక్తివంతమైంది.అమెరికాలోనూ, బయటా అధ్యక్షుడు ప్రయాణించే మెరైన్ వన్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

అసాధారణ విశిష్టతలు ఈ హెలికాప్టర్ సొంతం
1. సుదీర్ఘ ప్రయాణాలకు అమెరికా అధ్యక్షుడిని అధికారిక ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌ఫోర్స్ వన్‌కు చేర్చడం మెరైన్ వన్ మొదటి ప్రాధాన్యం. అధ్యక్షుడి పర్యటనకు ఇప్పుడు మోటార్ కేడ్ బదులు దీనినే ఎంచుకుంటున్నారు.
2. హెచ్‌ఎంఎక్స్ 1 స్కాడ్రన్‌కు చెందిన నలుగురు పైలట్లకు మాత్రమే దీన్ని నడిపే గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అమెరికా రాష్ట్రాల అధినేతలు, ఇతర వి.ఐ.పిల పర్యటనలను ఈ స్కాడ్రన్ నిర్వహిస్తుంది.
3. ఈ భూగోళంలో అధ్యక్షుడు ఎక్కడ దిగినా మెరైన్ వన్ సిబ్బంది అక్కడ పూర్తి యూనిఫాంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ తన పదవీకాలం చివరి రోజుల్లో ఒకసారి మారుమూల ప్రాంతం అరిజోనాకు వెళ్లారు. అక్కడ కూడా మెరైన్ ఆయనకు స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నదని అమెరికా రాజకీయవేత్త బ్రూస్ బాబిట్ రాశారు.
4. ఒక్క మెరైన్ వన్ ఎప్పుడూ వెళ్లదు. అదేమాదిరి 5 హెలికాప్టర్లు వెంట ఉంటాయి. వాటిలో ఒక దాన్లో అమెరికా అధ్యక్షుడు ఉంటారు. మిగతా నాలుగు … అధ్యక్షుడికి ఏ ముప్పు వాటిల్లకుండా ప్రయాణించినంత సేపూ నిరంతరం నిఘా ఉంచుతాయి. ఈ సాంకేతికతను ‘షెల్ గేమ్’ అంటారు.
5. ఈ విమానంలో 14 మంది దాకా ప్రయాణించవచ్చు. అధ్యక్షుడు మామూలు గొంతుతో మాట్లాడినా వినిపించేంతగా కేబిన్ శబ్దాన్ని తగ్గించారు.
6. సి 17 గ్లోబ్‌మాస్టర్ లేదా సి 5 గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాల తరహాలో మెరైన్ వన్‌ను రూపొందించారు.
7. క్షిపణి దాడుల్ని సైతం ఎదుర్కొనే ప్రామాణిక సైనిక ఆయుధ సంపత్తి మెరైన్‌లో ఉంది.

70 లక్షలు కాదు.. 1.2 లక్షల మందే

అహ్మదాబాద్ : ఫిబ్రవరి 24 న నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ రోడ్ షోకు హాజరయ్యేది 70 లక్షల మంది కాదని, రెండు లక్షల మంది కన్నా తక్కువ మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. విమానాశ్రయం నుంచి మొతేరా క్రికెట్ స్టేడియం వరకు 22 కిమీ పొడవున సాగే ఈ రోడ్డు షోలో దాదాపు ఒకటి నుంచి రెండు లక్షల వరకు ప్రజలు పాల్గొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు , ప్రధాని మోడీకి స్వాగతం ఇస్తారని అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా వివరించారు. ట్రంప్ ఇటీవల దాదాపు 7 మిలియన్ ప్రజలు పాల్గొనవచ్చని, ఇది చాలా ఉత్కంఠ భరితమని, దీనికి అందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్ణయించిన రూటు ప్లాను ప్రకారం ట్రంప్, మోడీ మొదట సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి సమీపాన ఇందిరా బ్రిడ్జి , ఎస్‌పి రింగ్ రోడ్డు మీదుగా కొత్తగా నిర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియం కు చేరుకుంటారు.

హౌడీ మోడీ వంటిదే నమస్తే ట్రంప్
అహ్మదాబాద్‌లో జరగనున్న నమస్తే ట్రంప్ కార్యక్రమం గత ఏడాది సెప్టెంబర్‌లో హోస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం వంటిదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవేష్ కుమార్ గురువారం వివరించారు. వారాంతపు పాత్రికేయ సమావేశంలో ఆయన ట్రంప్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని ఆయన ఆశాభావం వెల్లడించారు. అహ్మదాబాద్ పర్యటన తరువాత ట్రంప్ దంపతులు ఆగ్రా సందర్శిస్తారని, అక్కడ నుంచి సాయంత్రం ఢిల్లీకి వెళ్తారని, ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని, పేర్కొన్నారు. ట్రంప్ సతీమణి మెలేనియా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో 2018 జులైలో ప్రవేశ పెట్టిన హేపీ కర్రికులమ్ (ఆనంద విద్యాబోధన ) విధానాన్ని సందర్శిస్తారు.

ట్రంప్ అతిథి మర్యాదలకోసం హర్దీప్ పురి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించే సమయంలో ఒక పెద్దాయన ఆయన వెన్నంటే ఉంటారు. రాజకీయాల్లోకి రాకముందు దౌత్యవేత్తగా పనిచేసిన 68 ఏళ్ల హర్దీప్ సింగ్ పురి ఇప్పుడు పౌర విమానయాన మంత్రిగా ఉన్నారు. ట్రంప్ రాకకోసం ఎదురుచూసే ఈ మంత్రి (మినిస్టర్ ఇన్ వెయిటింగ్) భారతదేశంలో అమెరికా అధ్యక్షుడి ప్రతినిధి బృందం పాల్గొనే అన్ని అధికారిక కార్యక్రమాల్లో వెంట ఉంటారు. అదే పురి బాధ్యత. ఫిబ్రవరి 24 నుంచి రెండు రోజులు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాతో సహా ఇండియాలో అధికారికంగా పర్యటిస్తారు.

2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భారతదేశం వచ్చినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బాధ్యతను (మినిస్టర్ ఇన్ వెయింటింగ్) నిర్వర్తించారు. ఏ దేశాధినేత వచ్చినా ఒక మంత్రికి ఈ బాధ్యతను అప్పగించడం ఆనవాయితీ. దేశాధినేత అధికారిక కార్యక్రమాలన్నింటికీ ఆయన హాజరవుతారు. ‘ ప్రభుత్వ అతిథి వెంట ఉండి అతిథి మర్యాదల కోసమే ఇలా నియమిస్తారు. ఇది మన ఆచారం. అందుకోసం ఒకరి నియమించడం ప్రొటోకాల్. ఇది ఆ వ్యక్తికి గౌరవప్రదమే కాకుండా ప్రతిష్టాత్మకం కూడా. అతిథి మర్యాదల బాధ్యత చూసుకునేందుకు ప్రధానమంత్రి ఒకరిని ఎంపిక చేసుకుంటారు’ అని మాజీ దౌత్యవేత్త బిఎస్ ప్రకాష్ అన్నారు.

US security personnel, vehicle arrive in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ట్రంప్ బలగం వస్తోంది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: