లాభాల స్వీకరణతో నష్టాలు

  153 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 2 శాతం నష్టపోయిన ఎసియన్ పెయింట్స్ ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్ల లాభాల బుకింగ్‌తో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయింది. బలహీనమైన ప్రపంచ ధోరణి, ముడి చమురు ధరల పెరుగుదల మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్ వంటి సంస్థల షేర్లు తగ్గిన నేపథ్యంలో మార్కెట్ క్షీణించింది. 30 షేర్ల సెన్సెక్స్ 152.88 పాయింట్లు లేదా […] The post లాభాల స్వీకరణతో నష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

153 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
2 శాతం నష్టపోయిన ఎసియన్ పెయింట్స్

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్ల లాభాల బుకింగ్‌తో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయింది. బలహీనమైన ప్రపంచ ధోరణి, ముడి చమురు ధరల పెరుగుదల మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్ వంటి సంస్థల షేర్లు తగ్గిన నేపథ్యంలో మార్కెట్ క్షీణించింది. 30 షేర్ల సెన్సెక్స్ 152.88 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 41,170 వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 45.05 పాయింట్లు లేదా 0.37 శాతం కోల్పోయి 12,080.85 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఏసియన్ పెయింట్స్, హెచ్‌యుఎల్, టిసిఎస్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రా టెక్ సిమెంట్ అత్యధిక నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎస్‌బిఐ, పవర్ గ్రిడ్, ఒఎన్‌జిసి లాభాలను ఆర్జించాయి.

కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళనంతో పెట్టుబడిదారులు జాగ్రత్త వహిస్తున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది కాకుండా ముడి చమురు ధరల పెరుగుదల కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. బ్రెంట్ క్రూడ్ ధర 0.14 శాతం పెరిగి బ్యారెల్ ధర 59.20 డాలర్లకు చేరుకుంది. చైనా సెంట్రల్ బ్యాంక్ ఇతర ఆసియా మార్కెట్లలో వడ్డీ రేట్లను తగ్గించడంతో షాంఘై స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. వైరస్ బారిన పడిన సంస్థలకు తక్కువ రుణాలు అందించడంలో సహాయపడాలనే ఉద్దేశ్యంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. టోక్యోలో కూడా లాభాలతో కనిపించింది. అయితే హాంకాంగ్, సియోల్ నష్టాలతో ఉన్నాయి.

ప్రారంభ ట్రేడింగ్‌లో యూరప్‌లోని ప్రధాన మార్కెట్లు కూడా క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ సూచీ 62.5 పాయింట్లు అంటే 0.4 శాతం పెరిగి 15,694 పాయింట్లకు చేరింది. స్మాల్‌క్యాప్ సూచీ 0.5 శాతం పెరిగి 14,747కు చేరింది. మరోవైపు రంగాల వారీగా సూచీలను చూస్తే, ఐటి ఇండెక్స్ అత్యంత నష్టపోగా, ఇదే వరుసలో ఎఫ్‌ఎంసిజి, మీడియా కౌంటర్స్ ఉన్నాయి. మరోవైపు పిఎస్‌యు బ్యాంక్ స్టాక్స్ లాభాలతో కనిపించాయి. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ సూచీ 1 శాతం పెరిగి 2,169 స్థాయిలో ముగిసింది.

శివరాత్రి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు
మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు. అందువల్ల శుక్రవారం మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈవారం నాలుగు రోజులే మార్కెట్ ఉందన్నమాట.

Sensex Ends 153 Points Lower

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లాభాల స్వీకరణతో నష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: