దొంగబుద్ధితో లొంగదీసుకునే యత్నం

అర్రులు చాచిన ఆరుపదుల వయస్సు అద్దె గర్భానికి రూ. 5లక్షల ఒప్పందం అదనంగా నెల ఖర్చులకు రూ.10వేలు తనతోనే గర్భం దాల్చాలని వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి మన తెలంగాణ/పంజగుట్ట(హైదరాబాద్): కృత్రిమ గర్భాదారణతో వారసుడు కావాలని ఓ మహిళతో ఒప్పందం చేసుకుని ఆపై సహజ సిద్ధంగా తనతో కలవాలంటూ వేధింపులకు పాల్పడిన ఓ వృద్ధుడిపై బాధిత యువతి ఫిర్యాదు మేరకు గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అద్దె గర్భం ద్వారా కుమారుడిని […] The post దొంగబుద్ధితో లొంగదీసుకునే యత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అర్రులు చాచిన ఆరుపదుల వయస్సు
అద్దె గర్భానికి రూ. 5లక్షల ఒప్పందం
అదనంగా నెల ఖర్చులకు రూ.10వేలు
తనతోనే గర్భం దాల్చాలని వేధింపులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి
మన తెలంగాణ/పంజగుట్ట(హైదరాబాద్): కృత్రిమ గర్భాదారణతో వారసుడు కావాలని ఓ మహిళతో ఒప్పందం చేసుకుని ఆపై సహజ సిద్ధంగా తనతో కలవాలంటూ వేధింపులకు పాల్పడిన ఓ వృద్ధుడిపై బాధిత యువతి ఫిర్యాదు మేరకు గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అద్దె గర్భం ద్వారా కుమారుడిని కనేందుకు ఒప్పందం కుదుర్చున స్వరూప్ రాజ్ (65) ఆ తరువాత సదరు యువతి తనతో నేరుగా పిల్లలను కనాలని వత్తిడి తేవడంతో ఆ యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..నగరంలోని చిలకలగూడ లో 23 సంవత్సరాల యువతి తన భర్తతో క్యాటరింగ్ వృత్తి చేసుకుంటై జీవనం కోనసాగిస్తున్నారు. కాగా వారి కుంటుంబలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సదరు యువతి తనకు పరిచయస్తుడైన నూర్ అనే ఏజెంట్‌ను కలిసింది. ఈక్రమంలో ఏజెంట్ నూర్ సోమాజిగూడ ఆనంద్ నగర్‌లోని దృవతార అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న స్వరూప్ రాజు (65) అనే వ్యక్తితో ఈనెల 11వ తేదీన పరిచయం చేశాడు. కాగా స్వరూప్‌రాజ్ తనకు ముగ్గురు కుమార్తెలున్నారని, మగ పిల్లలు కలుగలేదని ,తనకు అద్దె గర్భం ద్వారా మగ పిల్లాడిని కనాలని సదరు యువతితో 5లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అంతే కాకుండా రోజు వారి ఖర్చుల కోసం నెలకు మరో పదివేల రూపాయలు ఇస్తానని కూడా సదరు యువతికు వివరించాడు. ఇందులో భాగంగా పిల్లోడు ఆరోగ్యంగా పుట్టేందుకు దేవుని ప్రార్ధించాలని చెప్పి బిర్లా మందిర్ అలయానికి తిసుకువెళ్ళి అక్కడ పూజలు సైతం చేయించాడు. అనంతరం స్వరూపరాజులో దుర్భుద్ది పుట్టింది. సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు ఒప్పందం చేసుకున్న మహిళతో నువ్వంటే ఇష్టమని ,నాకు అద్దె గర్భం ద్వారా కాకుండా నేరుగా పిల్లలను కనాలని ఉందని ప్రస్తావన తెచ్చాడు. తనతో నేరుగా పిల్లలను కంటే ఒప్పందం ప్రకారం ఇచ్చే రూ. 5లక్షలకు అదనంగా మరో రూ. 50వేలు ఇస్తానని ఆశపెట్టాడు. ఇందుకు అంగీకరించాలని షరతు విధించాడు. అంతటితో ఆగకుండా ఫోన్ చేసి తరచూ వేధింపులకు పాల్పడ్డాడు. పేదరికంతో అప్పులు తీరుతాయని సరోగసికి ఒప్పుకున్నానని, నేరుగా పిల్లలు కనేవిధంగా ఆంక్షలు విధించడంపై సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరుగా కలిసి పిల్లలను కనేందుకు ఒప్పుకోవాలని స్వరూప్ రాజ్ వేధింపులతో విసిగిపోయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. బాధిత యువతి తన భర్తతో కలిసి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడు స్వరూపరాజ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసిపి తిరుపతన్న తెలిపారు.

Panjagutta Police arrested a Man for Sexual Harassment

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దొంగబుద్ధితో లొంగదీసుకునే యత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: