విజయనిర్మల పేరులోనే విజయం ఉంది, నిర్మలత్వం ఉంది

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. కృష్ణ, విజయనిర్మల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని విజయనిర్మలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని దర్శకురాలు నందిని రెడ్డికి కృష్ణంరాజు, మహేష్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ “నా […] The post విజయనిర్మల పేరులోనే విజయం ఉంది, నిర్మలత్వం ఉంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. కృష్ణ, విజయనిర్మల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని విజయనిర్మలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని దర్శకురాలు నందిని రెడ్డికి కృష్ణంరాజు, మహేష్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ “నా స్నేహితురాలు, ఆప్యాయంగా నన్ను అన్నయ్య అని పిలిచే విజయనిర్మల మనమధ్య లేకపోవడం బాధాకరం. ఆమె పేరులోనే విజయం ఉంది, నిర్మలత్వం ఉంది. 46 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి ఆమె ఎంతో ఎత్తుకి ఎదిగారు. ఆమె సాధించిన విజయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

మహేష్‌బాబు మాట్లాడుతూ “నా సినిమాలు విడుదలయినప్పుడు ప్రతిసారి మొదట నాన్నగారు మార్నింగ్ షో చూసి నాతో మాట్లాడేవారు. ఆతర్వాత విజయనిర్మల మాట్లాడి కంగ్రాట్స్ చెప్పేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తర్వాత నాన్నగారు కంగ్రాట్స్ చెప్పిన తర్వాత ఆమె మాట్లాడుతుందని అనుకొని వెంటనే రియలైజ్ అయ్యాను. ఆరోజు ఆమె లేని లోటు కనిపించింది. ఈ విగ్రహావిష్కరణతో ఆమెకు మేము ఇస్తున్న చిన్న నివాళి ఇది”అని పేర్కొన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ “వంద సినిమాలు చేసిన తర్వాత విజయనిర్మల డైరెక్షన్ చేసింది. మొదటి సినిమా తక్కువ బడ్జెట్‌లో అవుతుందని మలయాళంలో ‘కవిత’ అనే సినిమా చేసింది. అది అద్భుతమైన విజయం సాధించింది. ఆ విజయోత్సాహంతో తెలుగులో ‘మీనా’ సినిమా తీసింది. అది వంద రోజులు ఆడి సూపర్ హిట్ అయింది. ఆతర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా 46 సినిమాలు తీస్తే… అందులో 95 శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం. ఈరోజున ఆమె మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, నరేష్ విజయకృష్ణ, మురళీమోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, నమ్రత, అచ్చి రెడ్డి, రేలంగి నరసింహారావు, గల్లా జయదేవ్, పివిపి, సుధీర్‌బాబు, ఆదిశేషగిరి రావు, శివకృష్ణ, మారుతి, బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Super star Krishna unveils bronze statue of Vijaya Nirmala

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విజయనిర్మల పేరులోనే విజయం ఉంది, నిర్మలత్వం ఉంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: