మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..

ముంబై: ఐదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరపడమే కాక, హత్య చేయడం క్రూరాతిక్రూరమైన నేరంగా తీర్పు చెబుతూ మహారాష్ట్ర పర్బానీ జిల్లా కోర్టు దోషికి మరణశిక్ష విధించింది. జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న తన మామ్మ, తాతయ్యలతో కలిసి ఉంటున్న ఐదేళ్ల బాలిక 2016 అక్టోబర్ 27న ఇంటిదగ్గర కనిపించక పోయేసరికి ఆమె కోసం గాలించారు. ఆమె అదృశ్యమైనట్టు రెండు రోజుల తరువాత సోన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా […] The post మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: ఐదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరపడమే కాక, హత్య చేయడం క్రూరాతిక్రూరమైన నేరంగా తీర్పు చెబుతూ మహారాష్ట్ర పర్బానీ జిల్లా కోర్టు దోషికి మరణశిక్ష విధించింది. జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న తన మామ్మ, తాతయ్యలతో కలిసి ఉంటున్న ఐదేళ్ల బాలిక 2016 అక్టోబర్ 27న ఇంటిదగ్గర కనిపించక పోయేసరికి ఆమె కోసం గాలించారు. ఆమె అదృశ్యమైనట్టు రెండు రోజుల తరువాత సోన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అక్టోబర్ 31న గ్రామంలోని పొలానికి సమీపాన బావిలో బాలిక శవం కనిపించింది. అదే జిల్లాలో ఉంటున్న వ్యవసాయ కార్మికుడిని ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం.. నిందితుడు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపిన తరువాత నైలాన్ తాడుతో ఆమె చనిపోయే వరకు ఉరి వేసి వేలాడ తీసినట్టు బయటపడింది. మృతదేహాన్ని సంచిలో కుక్కి వ్యవసాయ బావిలో పడేసినట్టు ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ కేసులో నేరుగా సాక్షం లేకపోయినా సాక్షాధారాల బట్టి ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయగలిగింది. బాధితురాలి తాతయ్యతోసహా మృతురాలు నిందితునితో ఆఖరిసారి కనిపించినట్టు చెప్పే సాక్షంతో పాటు మొత్తం 23 సాక్షాలను ఈ కేసులో విచారించారు.

Man gets Death Sentance for Minor Raped in Mumbai

The post మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: