కొండాపూర్‌లో సిఎం కెసిఆర్ విగ్రహ ఆవిష్కరణ

  కరీంనగర్: జిల్లాలోని చిగురుమామిడి మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ అనే వ్యక్తి సిఎం కెసిఆర్ కు వీరాభిమాని. అయితే వెంకటేష్ తన ఇంటి ముందు కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన కెసిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటేష్ 10కిలోల కేక్ కట్ చేసి కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.   ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ… కెసిఆర్ అంటే తమ కుటుంబానికి ఎనలేని అభిమానమని, రోజు […] The post కొండాపూర్‌లో సిఎం కెసిఆర్ విగ్రహ ఆవిష్కరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్: జిల్లాలోని చిగురుమామిడి మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ అనే వ్యక్తి సిఎం కెసిఆర్ కు వీరాభిమాని. అయితే వెంకటేష్ తన ఇంటి ముందు కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన కెసిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటేష్ 10కిలోల కేక్ కట్ చేసి కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 

ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ… కెసిఆర్ అంటే తమ కుటుంబానికి ఎనలేని అభిమానమని, రోజు తెల్లవారు జామున కెసిఆర్ విగ్రహాం చూసాకే తాము పనులకు వెళ్తామని చెప్పారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం అలుపు లేకుండా ఉద్యమాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా కెసిఆర్ నిలుస్తున్నారని కొనియాడారు. లక్ష రూపాయాలతో కెసిఆర్ విగ్రహాం ఏర్పాటు చేసినట్లు వెంకటేశ్ వెల్లడించారు.

CM KCR Statue Discovery in Kondapur, Karimnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొండాపూర్‌లో సిఎం కెసిఆర్ విగ్రహ ఆవిష్కరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: