గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి.. పచ్చదనం పెంచాలి

  సంగారెడ్డి : జిల్లాల్లో పల్లెప్రగతి కార్యక్రమం కోసం జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు , ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ఎ మణిక్ రావు పాల్లొన్నారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని హరీశ్ రావు అన్నారు. ప్రతి గ్రామం ఫిబ్రవరి 26 వరకు పల్లె ప్రగతి సాధించాలని, ఈ నెల తర్వాత స్వయంగా సిఎం కెసిఆర్ తో […] The post గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి.. పచ్చదనం పెంచాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సంగారెడ్డి : జిల్లాల్లో పల్లెప్రగతి కార్యక్రమం కోసం జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు , ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ఎ మణిక్ రావు పాల్లొన్నారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని హరీశ్ రావు అన్నారు. ప్రతి గ్రామం ఫిబ్రవరి 26 వరకు పల్లె ప్రగతి సాధించాలని, ఈ నెల తర్వాత స్వయంగా సిఎం కెసిఆర్ తో సహా మంత్రులు, ఉన్నతాధికారులు గ్రామాల్లో పల్లె ప్రగతిపై ఆకస్మికంగా తనిఖీలు చేస్తారని ఆయన తెలిపారు. గ్రామాల్లో చెత్త సేకరణ, వైకుంఠదామం, డంప్ యార్డులు, ఇంకుడు గుంతల నిర్మాణం, హరితహారం, నర్సరీ, సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా చేయలన్నారు.

పల్లెప్రగతితో తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, రూ.500 కోట్లతో గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం చేయబోతున్నట్టు చెప్పారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, సంగారెడ్డి పల్లె ప్రగతిలో మొదటి స్థానంలో నిలవాలని మంత్రి హరీశ రావు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఆలోచనతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి, పచ్చదనం పెంచాలి అని ఆయన సూచించారు. గ్రామాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

District Level Panchayati Raj medley for Palla Pragati

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి.. పచ్చదనం పెంచాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.