సిఎం కెసిఆర్ కు మోడీ జన్మదిన శుభాకాంక్షలు..

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కెసిఆర్ కు ట్వీట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ట్వీట్టర్ వేదికగా సిఎం కెసిఆర్ కు జన్మదిన వుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. మంత్రి కెటిఆర్ కూడా తన తండ్రి, సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తల్లిని […] The post సిఎం కెసిఆర్ కు మోడీ జన్మదిన శుభాకాంక్షలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కెసిఆర్ కు ట్వీట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ట్వీట్టర్ వేదికగా సిఎం కెసిఆర్ కు జన్మదిన వుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. మంత్రి కెటిఆర్ కూడా తన తండ్రి, సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. అలాగే ఎపి సిఎం జగన్ తోపాటు ఎపి మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్టర్ ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్య జీవితాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా సిఎం కెసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ హరితహారంలో పాల్గొంటున్నారు.

PM Modi greets birthday wishes to CM KCR

The post సిఎం కెసిఆర్ కు మోడీ జన్మదిన శుభాకాంక్షలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.