తెలంగాణ జాతిపిత కెసిఆర్ శతవసంతాలు చూడాలి: హరీష్

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 66వ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. కెసిఆర్ కు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. తెలంగాణ అభివృద్ధి కెసిఆర్‌ దక్షతకు నిదర్శనమని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ నేలకు కెసిఆరే శ్రీరామరక్ష, తెలంగాణ జాతిపిత కెసిఆర్ శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటున్నానని హరీష్ ట్వీట్ చేశారు.  జలవిహార్‌లో కెసిఆర్ బర్త్ డే వేడుకలు మంత్రి […] The post తెలంగాణ జాతిపిత కెసిఆర్ శతవసంతాలు చూడాలి: హరీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 66వ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. కెసిఆర్ కు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. తెలంగాణ అభివృద్ధి కెసిఆర్‌ దక్షతకు నిదర్శనమని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ నేలకు కెసిఆరే శ్రీరామరక్ష, తెలంగాణ జాతిపిత కెసిఆర్ శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటున్నానని హరీష్ ట్వీట్ చేశారు.  జలవిహార్‌లో కెసిఆర్ బర్త్ డే వేడుకలు మంత్రి తలసాని శ్రీనివాస్, రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జలవిహార్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఎంపి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. జలవిహార్ లో కాన్సెప్ట్ ఆర్ట్, ఫోటో ఎగ్జిబిషన్‌ను సంతోష్ ప్రారంభించారు. కెసిఆర్ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలు మొక్కలు నాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంత్రులు, ఎంఎల్‌ఎలు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

The post తెలంగాణ జాతిపిత కెసిఆర్ శతవసంతాలు చూడాలి: హరీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: