టాప్ 8 కంపెనీల మార్కెట్ విలువరూ.లక్ష కోట్లకు పైగా పెరిగింది

  అత్యధికంగా లాభపడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూఢిల్లీ : గత వారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ(మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.1.09 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి వంటి కంపెనీలు మాత్రమే గతవారం నష్టపోయాయి. మిగతా అన్ని కంపెనీలు మార్కెట్ విలువను పెంచుకున్నాయి. వాటిలో మొదటగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.33,534 కోట్లు పెరిగి రూ.9.42 లక్షల కోట్లకు చేరి, పది కంపెనీల్లో అత్యధికంగా […] The post టాప్ 8 కంపెనీల మార్కెట్ విలువరూ.లక్ష కోట్లకు పైగా పెరిగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అత్యధికంగా లాభపడిన రిలయన్స్ ఇండస్ట్రీస్

న్యూఢిల్లీ : గత వారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ(మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.1.09 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి వంటి కంపెనీలు మాత్రమే గతవారం నష్టపోయాయి. మిగతా అన్ని కంపెనీలు మార్కెట్ విలువను పెంచుకున్నాయి. వాటిలో మొదటగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.33,534 కోట్లు పెరిగి రూ.9.42 లక్షల కోట్లకు చేరి, పది కంపెనీల్లో అత్యధికంగా లాభపడింది. ఆ తర్వాత హిందుస్తాయన్ యునిలివర్(హెచ్‌యుఎల్) మార్కెట్ విలువ రూ.20,619 కోట్లు పెరిగి రూ.4.88 లక్షల కోట్లు కాగా, టిసిఎస్ మార్కెట్ విలువ రూ.17,673 కోట్లు పెరిగి రూ.8.19 లక్షల కోట్లకు చేరింది.

భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.13,911 కోట్లు పెరిగి రూ.3.08 లక్షల కోట్లు కాగా, బజాజ్ ఫైనాన్స్ విషయానికొస్తే రూ.8,014 కోట్ల మార్కెట్ విలువ పెరిగి రూ.2.87 లక్షల కోట్లు అయింది.  ఐసిఐసిఐ బ్యాంక్ విలువ కూడా రూ.6,138 కోట్లు పెరిగి రూ.3.53 లక్షల కోట్లకు చేరింది. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ.5,666 కోట్లు పెరిగి రూ.3.21 లక్షల కోట్లు అయింది. ఐటి సంస్థ ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.3,832 కోట్లు పెరిగి రూ.3.34 లక్షల కోట్లు అయింది.

వీటికి విరుద్ధంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.12,409 కోట్లు పడిపోయి రూ.6.67 లక్షల కోట్లకు తగ్గింది. అదే సమయంలో హెచ్‌డిఎఫ్‌సి విలువ రూ.777 కోట్లు తగ్గి రూ.4.15 లక్షల కోట్లకు చేరింది. టాప్ 10 కంపెనీల ర్యాంకింగ్ చూస్తే, మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. గతవారం సెన్సెక్స్ మొత్తంగా 115.89 పాయింట్లు అంటే 0.28 శాతం పెరిగింది.

Top 8 companies market value Rs 1.09 lakh crore

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టాప్ 8 కంపెనీల మార్కెట్ విలువరూ.లక్ష కోట్లకు పైగా పెరిగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: