ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్

  మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమనేత, ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా చిత్రకారులు తమ కుంచెలకు పదును పెట్టారు. ఆంతరంగాల్లోని ఆలోచనలను ఆవిష్కరిస్తూ కెసిఆర్‌పై అభిమానం చాటుకున్నారు. పలువురు చిత్రకారులు సిఎం కెసిఆర్‌పై చిత్రీకరించిన పేయింటింగ్స్, పెన్షిల్ స్కెచ్‌లు మాదాపూర్‌లోని ఆర్ట్‌గ్యాలరీలో కొలువుతీరాయి. సిఎం కెసిఆర్ రాజకీయ జీవితంలోని అరుదైన సంఘటనలను, చరిత్రాత్మక విజయాలను ఆవిష్కరిస్తూ ఏర్పాటుచేసిన ప్రదర్శనచూపరులను ఆకట్టుకుంటుంది. అనేక మంది చిత్రకారులు సిఎం కెసిఆర్ పై అభిమానంతో గీసిన చిత్రాల్లో కార్టున్స్, స్కెచ్, పోట్రేట్స్‌తో […] The post ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమనేత, ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా చిత్రకారులు తమ కుంచెలకు పదును పెట్టారు. ఆంతరంగాల్లోని ఆలోచనలను ఆవిష్కరిస్తూ కెసిఆర్‌పై అభిమానం చాటుకున్నారు. పలువురు చిత్రకారులు సిఎం కెసిఆర్‌పై చిత్రీకరించిన పేయింటింగ్స్, పెన్షిల్ స్కెచ్‌లు మాదాపూర్‌లోని ఆర్ట్‌గ్యాలరీలో కొలువుతీరాయి. సిఎం కెసిఆర్ రాజకీయ జీవితంలోని అరుదైన సంఘటనలను, చరిత్రాత్మక విజయాలను ఆవిష్కరిస్తూ ఏర్పాటుచేసిన ప్రదర్శనచూపరులను ఆకట్టుకుంటుంది. అనేక మంది చిత్రకారులు సిఎం కెసిఆర్ పై అభిమానంతో గీసిన చిత్రాల్లో కార్టున్స్, స్కెచ్, పోట్రేట్స్‌తో పాటు పలువర్ణచిత్రాలు ఉన్నాయి. సుప్రసిద్ధ చిత్రకారుడు, ఆర్ట్‌గ్యాలరీ క్యూరేటర్ రమణరెడ్డి అనేకమంది కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన విభిన్న పేయింటింగ్స్‌ను ఎంపిక చేసి ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనల్లో సిఎంకెసిఆర్ జీవిత విశేషాలతోపాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా చిత్రకారులు తమకుంచెలకు పదును పెట్టారు. చిత్రకారులకు సిఎం కెసిఆర్‌పై ఉన్న అభిమానం వర్ణచిత్రాలు కాన్వాసుపై ఒదిగిపోయాయు. కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా పచ్చబడిన పల్లెలను కూడా చిత్రకారులు చిత్రీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కళాకారులు తమకళారూపాలతో సిఎంకెసిఆర్‌కు 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలంతా సిఎం కెసిఆర్ జన్మదినోత్సవంసదర్భంగా మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలపాలని కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులుమన్నె క్రిషాంక్, డాక్టర్ చిరుమిల్ల రాకేష్, నంది అవార్డు గ్రహీత సాగర్ రెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Impressive Art Exhibition

The post ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: