వెనక్కి తీసుకోం

  ఎవరేమన్నా సిఎఎ, 370 రద్దు నిర్ణయాలు మారవు : వారణాసిలో ప్రధాని మోడీ జాతీయ ప్రయోజనాల కోసమే ఆ రెండూ బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకున్నాం ఎన్నో ఏళ్లుగా జాతి ఎదురుచూసింది రామాలయ నిర్మాణం ఇక శరవేగం వారణాసి: ఎటువంటి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆర్టికల్ 370, సిఎఎలపై వెనకకు వెళ్లేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరచట్టం నిర్ణయాలు తిరుగులేనివని స్పష్టం చేశారు. తమ స్వనియోజకవర్గం వారణాసిలో ఒక్కరోజు పర్యటన […] The post వెనక్కి తీసుకోం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎవరేమన్నా సిఎఎ, 370 రద్దు నిర్ణయాలు మారవు : వారణాసిలో ప్రధాని మోడీ

జాతీయ ప్రయోజనాల కోసమే ఆ రెండూ
బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకున్నాం
ఎన్నో ఏళ్లుగా జాతి ఎదురుచూసింది
రామాలయ నిర్మాణం ఇక శరవేగం

వారణాసి: ఎటువంటి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆర్టికల్ 370, సిఎఎలపై వెనకకు వెళ్లేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరచట్టం నిర్ణయాలు తిరుగులేనివని స్పష్టం చేశారు. తమ స్వనియోజకవర్గం వారణాసిలో ఒక్కరోజు పర్యటన సందర్భంగా ప్రధాని ఆదివారం మాట్లాడారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు, అన్ని వైపుల నుంచి పలు రకాల ఒత్తిళ్లు ఉన్నా , నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. వీటిపై పునరాలోచన ప్రసక్తే లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా జాతియావత్తూ వీటిపై నిర్ణయాలకు ఎదురుచూస్తూ వచ్చిందని ప్రధాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దిక్కుల నుంచి బెదిరింపులు వచ్చినా, తీసుకున్న ఫైసలాపై తిరుగులేకుండా సాగాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఒక బహిరంగ సభలో చెప్పారు.

దేశంలోని పలు ప్రాంతాలలో పౌరచట్టంపై తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తం అవుతున్న దశలో ప్రధాని ఘాటు వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేసినట్లు, నిర్మాణ పనులు ఇక వేగవంతం అవుతాయని తెలిపారు. రామ్‌ధామ్ పేరిట బ్రహ్మండమైన రీతిలో ఆలయ నిర్మాణం సాగుతుందని చెప్పారు. అంతకు ముందు ప్రధాని ఇక్కడ ఏకంగా రూ 1250 కోట్ల రూపాయల విలువైన 50 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రోజంతా పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు.

మహాకాల్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా
మూడు జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానించే రై లు మహాకాల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను ప్రధాని ప్రా రంభించారు. వారణాసి, ఉజ్జయినీ, మధ్యప్రదేశ్‌లో ని ఓంకారేశ్వర్‌లను కలుపుతూ నడిచే ఈ రైలును ఐ ఆర్‌సిటిసి పలు సౌకర్యాలతో నిర్వహిస్తుంది. దేశంలోనే అతి పెద్దదిగా నిలిచే 63 అడుగుల ఎతైన పం డిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. దీన్‌దయాళ్ స్మారక కేంద్రాన్ని జా తికి అంకితం చేశారు.గత కొద్ది సంవత్సరాలుగా కాశీలో రూ 25000 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు, ఇవి చాలా వరకూ పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. దేశంలోని అనేకానేక వారసత్వ, మతపరమైన స్థలాలను సందర్శించేందుకు అనువైన రవాణా అనుసంధానం అవసరం అన్నారు. దీనితో పర్యాటక రంగం విలసిల్లుతుందని, దేశాన్ని 5ట్రిలియన్ డాల ర్ల ఆర్థిక శక్తిగా మలిచేందుకు వీలేర్పడుతుందన్నారు.

హస్తకళల ప్రదర్శన ప్రారంభం
వారణాసి సందర్శన సందర్భంగా ప్రధాని మోడీ కాశీ ఏక్ రూప్ అనేక్ పేరిట వెలిసిన చేతివృత్తులు, చేనేతల కళా ప్రదర్శనను ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 10వేల మంది చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తులు కనువిందు చేస్తాయి.

CAA and 370 cancellation decisions are unchanged

The post వెనక్కి తీసుకోం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: