కెసిఆర్ కలకాలం వర్థిల్లాలి

  మనతెలంగాణ/హైదరాబాద్: కవలలుగా జన్మించడం అదృష్టమని సినిమా స్టంట్ మాస్టర్లు.కవలలు రామ్‌లక్ష్మన్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 66వ జన్మదినోత్సవం సందర్భంగా ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌పబ్లిక్ గారెన్స్‌లో కవలపిల్లలతో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామ్‌లక్ష్మణ్ మాట్లాడుతూ కవలలు ఎంతో అన్యోన్యంగా ఉంటారని చెప్పారు. ఉమ్మడి కుటుంబం లో మేము ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నామని వారు చెప్పారు. కలకాలం ఇలాగా కలిసి ఉంటామన్నారు. కవలల అభిప్రాయాలు, ఆలోచనలు […] The post కెసిఆర్ కలకాలం వర్థిల్లాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్: కవలలుగా జన్మించడం అదృష్టమని సినిమా స్టంట్ మాస్టర్లు.కవలలు రామ్‌లక్ష్మన్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 66వ జన్మదినోత్సవం సందర్భంగా ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌పబ్లిక్ గారెన్స్‌లో కవలపిల్లలతో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామ్‌లక్ష్మణ్ మాట్లాడుతూ కవలలు ఎంతో అన్యోన్యంగా ఉంటారని చెప్పారు. ఉమ్మడి కుటుంబం లో మేము ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నామని వారు చెప్పారు. కలకాలం ఇలాగా కలిసి ఉంటామన్నారు. కవలల అభిప్రాయాలు, ఆలోచనలు కూడా ఒకేతీరుగా ఉంటాయని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గట్టు రాంచందర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రికెసిఆర్ 66వ జన్మదినోత్సవం సందర్భంగా 66 మంది కవలలతో కార్యక్రమం నిర్వహించడం హర్షనీయమన్నారు.

ట్విన్స్ పేరెంట్స్‌కి అభినందనలు తెలిపారు. శాసనమండలి సభ్యుడు నవీన్‌కుమార్ మాట్లాడుతూ నాకు కవలపిల్లలు ఉన్నారని చెప్పారు. ట్విన్స్‌ను పెంచడం ఎంతో సున్నితమైన అంశమన్నారు. ట్విన్స్‌కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన సంపూర్ణమద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదకుటుంబాల నుంచి వచ్చిన కవలలకు సహాయం అందించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కవలలకు ఉచిత విద్య,వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఇంగ్లీష్ అక్షరాల మాదిరిగా నిర్వహించిన మానవ హారం పలువురిని అమితంగా ఆకట్టుకుంది.

Twins birthday wishes to CM KCR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కెసిఆర్ కలకాలం వర్థిల్లాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: