ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు..

  ఆహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు ట్రంప్ గడపనున్నారు. అందుకోసం విజయ్ రూపాణి సర్కార్ రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14 కోట్లను అందించనుంది. ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు ఏర్పాటు, […] The post ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు ట్రంప్ గడపనున్నారు. అందుకోసం విజయ్ రూపాణి సర్కార్ రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14 కోట్లను అందించనుంది. ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు ఏర్పాటు, పాత రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. వీటి కోసం రూ.80 కోట్లను కేటాయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ట్రంప్ భద్రత కోసమే రూ.15 కోట్ల దాకా ఖర్చుచేయనున్నారు. మోడీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు అదనంగా రూ.4 కోట్లు వెచ్చిస్తున్నారు.

Donald Trump to arrive India on Feb 24th

The post ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: