సమరం ముగిసింది.. ఇక సమన్వయమే

  ఢిల్లీని పాలించేందుకు మోడీ ఆశీస్సులు కావాలి నేను అందరి సిఎంను, ఢిల్లీ నా కుటుంబం ప్రమాణ స్వీకారం తర్వాత ప్రసంగించిన ఢిల్లీ సిఎం వేదికపై ప్రత్యేక అతిథులుగా 50 మంది సామాన్యులు ఆరుగురితో కేజ్రీ కేబినెట్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయాలని ఉందని మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్ చెప్పారు. ఎలాంటి సమస్యలు లేకుండా దేశ రాజధానిని సజావుగా పాలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశీస్సులు కావాలని […] The post సమరం ముగిసింది.. ఇక సమన్వయమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీని పాలించేందుకు మోడీ ఆశీస్సులు కావాలి
నేను అందరి సిఎంను, ఢిల్లీ నా కుటుంబం
ప్రమాణ స్వీకారం తర్వాత ప్రసంగించిన ఢిల్లీ సిఎం
వేదికపై ప్రత్యేక అతిథులుగా 50 మంది సామాన్యులు
ఆరుగురితో కేజ్రీ కేబినెట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయాలని ఉందని మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్ చెప్పారు. ఎలాంటి సమస్యలు లేకుండా దేశ రాజధానిని సజావుగా పాలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశీస్సులు కావాలని ఆయన కోరారు. ‘ఎన్నికలు ముగిశాయి. రాజకీయాలూ ముగిశాయి. ఎన్నికల ప్రచారంలో తనపై వ్యాఖ్యలు చేసిన ప్రత్యర్థుల్ని క్షమించాను’ అని ఢిల్లీ సిఎం అన్నారు. ‘భారత మాతాకీ జై’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రిమో ‘హమ్ హోంగే కామ్యాబ్’ అని పాడుతూ ముగించారు. రామ్‌లీలా మైదాన్‌లో జనం ఆయనతో గొంతు కలిపారు. తను ‘ఢిల్లీ బిడ్డ’ అని చెబుతూ ఇది తన ఒక్కడి విజయం కాదని, ఢిల్లీ ప్రజలదని పేర్కొన్నారు. ‘ఢిల్లీ పాలన సజావుగా సాగేందుకు మనమంతా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశీస్సులు కోరాలి’ అని ప్రమాణ స్వీకారం తర్వాత ప్రసంగిస్తూ చెప్పారు.

 

అందరికీ సిఎంను : కేజ్రీవాల్
తను ఎవరినీ సవతి తల్లి ప్రేమతో చూడలేదని, గత ఐదేళ్లలో అందరికోసం పనిచేశానని, ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించానని కేజ్రీవాల్ అన్నారు. ‘ఎన్నికల్లో కొందరు ‘ఆప్’కు ఓటేశారు. కొందరు బిజెపి, కాంగ్రెస్‌కు వేశారు. అయితే ఈ రోజు నుంచీ నేను అందరి ముఖ్యమంత్రిని. రాజకీయ సిద్ధాంతాలతో నాకు సంబంధం లేదు. రెండు కోట్లమంది ఢిల్లీ ప్రజలు నా కుటుంబం’ అని ఆప్ చీఫ్ పేర్కొన్నారు. దేశంలో రాజకీయాల్ని మార్చిన ఘనత ఢిల్లీ ప్రజలదేనని, అందుకే ప్రపంచంలో భారతదేశం పేరు మారుమోగుతోందని తెలిపారు. తను అన్నీ ఉచితంగా ఇస్తున్నానంటూ కొందరు విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ కేజ్రీవాల్ ‘ఈ ప్రపంచంలో ప్రకృతి ఇచ్చింది ఏదైనా ఉచితమే. తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ఆశీస్సులు కావచ్చు. ప్రాథమిక సదుపాయాలకు వెల కట్టడం సిగ్గుచేటు. కేజ్రీవాల్ ప్రజల్ని ప్రేమిస్తారు. కాబట్టి ఈ ప్రేమ ఉచితం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యానికి లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకు ఫీజు వసూలు చేయడం నాకు సిగ్గనిపిస్తుంది’ అని కేజ్రీవాల్ వివరించారు.

వేదికపై ‘ఢిల్లీ నిర్మాతలు’
గత ఐదేళ్లలో ఢిల్లీ అభివృద్ధికి నిరంతరం కృషిచేసి, అనేక సౌకర్యాల కల్పనకు దోహదపడిన వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా కేజ్రీవాల్‌తో వేదికను పంచుకున్నారు.

మంత్రులుగా ఆరుగురు
మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గహ్లాట్, గోపాల్ రాయ్, రాజేంద్రపాల్ పాల్ గౌతం, ఇమ్రాన్ హుస్సేన్ తో సహా ఆరుగురు ఎంఎల్‌ఎలు ఈ సందర్భంగా ఢిల్లీ కేబినెట్‌లో మంత్రులుగా రామ్‌లీలా మైదాన్‌లో ప్రమాణం చేశారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వారిచేత ప్రమాణం చేయించారు. రాయ్ స్వాతంత్య్ర సమరయోధుల పేరుమీద, గౌతం …గౌతమ బుద్ధుడిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రమాణం చేశారు.

ఆకట్టుకున్న ‘బేబీ మఫ్లర్ మేన్’
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో క్రేజీగా నిలిచిన వ్యక్తి … ‘బేబీ మఫ్లర్ మాన్’ గా అందరికీ తెలుసు. ఏడాది చిన్నారి ఆవ్యన్ తోమర్. ఆప్ చీఫ్ వేసుకునే డ్రెస్‌లో పార్టీ టోపీ, కళ్లద్దాలు పెట్టుకుని, కేజ్రీవాల్ మార్క్ మఫ్లర్ చుట్టుకొని రామ్‌లీలా మైదాన్‌కు వచ్చిన ఈ ఏడాది బుడతడు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఆప్ మద్దతుదారుడు రాహుల్ తోమర్ కుమారుడు ఆవ్యన్ …మంగళవారంనాడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు ఇదే డ్రెస్‌లో సోషల్ మీడియాలో క్రేజీ స్టార్ అయ్యాడు. పార్టీ ప్రజాప్రతినిధులు భగవంత్ మాన్, సంజయ్‌సింగ్‌తో సహా చాలామంది ఈ బాబుకు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. చాలామంది ఫోటోలు తీసుకున్నారు.

Arvind Kejriwal 3.0 was sworn In Delhi Ramlila Maidan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమరం ముగిసింది.. ఇక సమన్వయమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: