దుండగులను ఎదుర్కోడంలో సంయమనం తప్పనిసరి

ఢిల్లీ పోలీసులకు కేంద్ర మంత్రి అమిత్‌షా సూచన న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులు దుండగుల పట్ల గట్టిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉండాలని, అదే సమయంలో రెచ్చగొట్టే సంఘటనలపై సంయమనం పాటించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా ఆదివారం సూచించారు. 73 వ ఢిల్లీ పోలీస్ వార్షికోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. దేశం మొత్తం మీద ఢిల్లీ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతున్నారని ఆయన అన్నారు. దేశం మొదటి హోం మంత్రి సర్దార్ […] The post దుండగులను ఎదుర్కోడంలో సంయమనం తప్పనిసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ పోలీసులకు కేంద్ర మంత్రి అమిత్‌షా సూచన

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులు దుండగుల పట్ల గట్టిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉండాలని, అదే సమయంలో రెచ్చగొట్టే సంఘటనలపై సంయమనం పాటించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా ఆదివారం సూచించారు. 73 వ ఢిల్లీ పోలీస్ వార్షికోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. దేశం మొత్తం మీద ఢిల్లీ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతున్నారని ఆయన అన్నారు. దేశం మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పడేల్ 1950లో ఎటువంటి రెచ్చగొట్టే సంఘటనలు ఎదురైనా ఢిల్లీ పోలీసులు ప్రశాంతంగా ఉండాలని, అదే సమయంలో దుండగులను ఎదుర్కొనడంలో గట్టిగా వ్యవహరించాలని సూచించినట్టు ఈ సందర్భంగా అమిత్‌షా ప్రస్తావించారు.

స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌డే, ఇతర పర్వదినాలు, విదేశీ ప్రతినిధుల పర్యటించేటప్పుడు ఢిల్లీ పోలీసులు ప్రభుత్వానికి ఎంతగానో సహకరిస్తుంటారని ప్రశంసించారు. పోలీసులపై నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతించడమౌతుందని, అదే సందర్భంలో దాదాపు 35000 మంది పోలీసులు తమ జీవితాలను విధులకు అంకితం చేస్తున్నారని గుర్తించాలని షా పేర్కొన్నారు. పార్లమెంటు భవనంపై 2001 లో ఉగ్రదాడి జరిగినప్పుడు, ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు ఢిల్లీ పోలీస్ అదికారులకు, బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు బలైన ఇన్‌స్పెక్టర్ ఎంసి శర్మకు షా నివాళులు అర్పించారు.

దేశ రాజధాని ఢిల్లీ భద్రత కోసం సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.857 కోట్లు మంజూరు చేసిందని, 165 పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 వేల సిసిటివి కెమెరాలు అమర్చడమైందని చెప్పారు. నగరం లోని మహిళల భద్రతకు మరో 9300 కెమెరాలు మంజూరు చేశారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమాల కోసం పోలీస్ గృహాలకు రూ.137 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఢిల్లీ పోలీస్ విభాగం తమ అధికారుల కోసం 700కు పైగా ఇళ్లను నిర్మిస్తోంది. భవిష్యత్తులో ఇళ్ల అవసరాలను తీర్చడమౌతుందని షా చెప్పారు.

Delhi Police remain calm while dealing with miscreants

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దుండగులను ఎదుర్కోడంలో సంయమనం తప్పనిసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: