కాస్తతం కమ్మగా..

  స్కూలుకి వెళ్లే పిల్లలు, ఉద్యోగాలు చేసుకునేవాళ్లు లంచ్ బాక్స్ తీసుకెళ్లక తప్పదు. రొటీన్‌కు భిన్నంగా, ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరలతో అన్నం వెరైటీలను ట్రై చేయొచ్చు. కొత్తిమీర, పాలకూర, పుదీనా కరివేపాకులాంటివి ఉపయోగించి అన్నం తయారు చేస్తే లంచ్‌లో తినడానికి రుచిగా ఉంటాయి. వారానికి ఒకరోజు వీటిని రుచి చూడండి!   కొత్తిమీర రైస్ కావల్సినవి : అన్నం: కప్పు, కొత్తిమీర కట్టలు: మూడు, పచ్చిమిర్చి: ఐదు, నిమ్మకాయలు: రెండు ( రసం తీసుకోవాలి) కరివేపాకు రెమ్మలు: రెండు, […] The post కాస్తతం కమ్మగా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్కూలుకి వెళ్లే పిల్లలు, ఉద్యోగాలు చేసుకునేవాళ్లు లంచ్ బాక్స్ తీసుకెళ్లక తప్పదు. రొటీన్‌కు భిన్నంగా, ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరలతో అన్నం వెరైటీలను ట్రై చేయొచ్చు. కొత్తిమీర, పాలకూర, పుదీనా కరివేపాకులాంటివి ఉపయోగించి అన్నం తయారు చేస్తే లంచ్‌లో తినడానికి రుచిగా ఉంటాయి. వారానికి ఒకరోజు వీటిని రుచి చూడండి!

 

కొత్తిమీర రైస్

కావల్సినవి : అన్నం: కప్పు, కొత్తిమీర కట్టలు: మూడు, పచ్చిమిర్చి: ఐదు, నిమ్మకాయలు: రెండు ( రసం తీసుకోవాలి) కరివేపాకు రెమ్మలు: రెండు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి: ఒకటి, కొబ్బరి తురుము: రెండు చెంచాలు, తాలింపు కోసం: ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, జీడిపప్పు: కొద్దిగా, నూనె: టేబుల్‌స్పూను.
తయారీ : బాణలిలో నూనె వేడి చేసి తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కొబ్బరి వేయించి ఆ తరువాత మిశ్రమంలా చేసుకోవాలి. మరో బాణలిలో నెయ్యి వేడి చేసి తాలింపు దినుసులు వేయించి ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా చేర్చి కొత్తిమీర మిశ్రమంలో వేయాలి. రెండు నిమిషాలయ్యాక అన్నం కూడా చేర్చి బాగా కలపాలి. కొత్తిమీర మిశ్రమం అన్నంలో పూర్తిగా కలిపాక దింపేస్తే సరిపోతుంది. పైన కొత్తిమీర తురుముతో అలంకరించాలి. దీని తయారీకి వాడే అన్నం వేడివేడిగా కాకుండా చల్లారనిచ్చి కలపాలి. లేదంటే ముద్దగా అవుతుంది.

పాలకూర రైస్

కావాల్సినవి : బాస్మతీ బియ్యం: రెండు కప్పులు, పాలకూర రసం : రెండు కప్పులు (పాలకూరను రుబ్బి రసం తీసుకోవాలి) కొబ్బరిపాలు: కప్పు, నీళ్లు : కప్పు, పచ్చిమిర్చి: ఆరు, క్యారెట్: ఒకటి (పెద్దది), బఠాణీలు: అరకప్పు
(నానబెట్టాలి) యాలకులు: రెండు, అల్లం ముద్ద అరచెంచా, పాలమీగడ: చెంచా, కరివేపాకు: నాలుగు రెబ్బలు, కొత్తిమీర, పుదీనా: కొద్దిగా
తయారీ : నానబెట్టిన బఠాణీలను ఉడికించుకోవాలి. తాజాగా దొరికితే వాడొచ్చు. ఇప్పుడు పొయ్యిపై పాత్ర పెట్టి మీగడ వేసి యాలకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు వేయించాలి. తరువాత పాలకూర రసం, కొబ్బరిపాలు, నీళ్లు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన బఠాణీ, కొత్తిమీర, పుదీనా ఒకదాని తరువాత ఒకటి చేర్చాలి. రసం మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యం వేసి కలిపి సన్నని మంటపై ఉంచి ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా తయారయ్యాక దింపే ముందు మరికాస్త కొత్తిమీర, పుదీనా వేస్తే సరిపోతుంది. దీన్ని కుక్కర్‌లో కూడా ఉడికించుకోవచ్చు. అయితే ఒక కూత రాగానే సిమ్‌లో ఉంచి, ఆ తరువాత కట్టేయాలి.

 

పుదీనా అన్నం

కావల్సినవి : బాస్మతి రైస్: రెండు కప్పులు, పుదీనా ఆకులు: 3 కప్పులు, పచ్చిబఠాణీలు: 1కప్పు, అల్లం, వెల్లుల్లి: కొంచెం, పచ్చిమిర్చి: 5, లవంగాలు: 5, జీడిపప్పు పలుకులు: అరకప్పు, నెయ్యి: 6 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు: 1కప్పు (సన్నగా కట్ చేసినవి)
తయారీ : ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, లవంగం మిక్సీలో వేసి పేస్టులాగా చేసి పక్కన పెట్టాలి. బియ్యం కడిగి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి పెట్టాలి. బాణలి వేడి చేసి అందులో కొంచెం నెయ్యి, ఉల్లిముక్కలు కొంచెంగా వేయించాలి. తరువాత పుదీనా పేస్టుని, పచ్చిబఠాణీలను వేయించి ఈ మిశ్రమంలోని బియ్యం వేసి బాగా కలిపి ఉప్పు కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. వేడి చేసి అందులో జీడిపప్పు వేయించి కొంచెం పుదీనా ఆకులు వేయించి ఉడికిన అన్నంలో వేసి బాగా కలపాలి. ఇది వెరైటీగా బావుంటుంది.

కరివేపాకు వెరైటీ

కావల్సినవి : కరివేపాకు: కప్పు, బియ్యం : ఒకటిన్నర కప్పు, కొబ్బరిపొడి: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఎండుమిర్చి: రెండు, సొంఠిపొడి: అర చెంచా, జీలకర్ర, ఆవాలు: చెంచా చొప్పున, ఉల్లిపాయ: ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్:్ట చెంచా, జీడిపప్పులు: పది, ఉప్పు, నూనె: తగినంత.
తయారీ : ముందుగా బియ్యాన్ని పొడిపొడిగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో చెంచా నూనె వేసి జీడిపప్పు, కొబ్బరి తురుము, కరివేపాకును వేర్వేరుగా వేయించుకోవాలి. వెంటనే కరివేపాకును పొడిచేసి పెట్టుకోవాలి. ఇదే బాణలిలో మరికొంచెం నూనె వేసి జీలకర్ర,ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తాలింపు వేయాలి. ఇందులో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ముద్ద సొంఠి పొడిచేసి చేర్చాలి. దీనిలో అన్నం కరివేపాకు పొడి, కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి కలపాలి. అన్నం కొంచెం వేడయ్యాక తగినంత ఉప్పు చేర్చి దింపాలి. అంతే. నోరూరించే కరివేపాకు రైస్ తయారవుతుంది.

Kothimbir, Palak, Pudina, Karivepaku Rice Recipes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాస్తతం కమ్మగా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: