మహిళల కోసమే స్మాష్‌బోర్డ్

    సోషల్ మీడియా విస్తరించిన తర్వాత మహిళలు చాలామంది ట్రోలింగ్ బారిన పడుతున్నారు. సెలబ్రిటీలు మొదలు సామాన్య మహిళల్ని వదలకుండా దుర్మార్గంగా ట్రోలింగ్ చేసేవారు ఎక్కువయ్యారు. దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. రాయడానికి కూడా వీల్లేని అసభ్య, పరుష పదజాలంతో చిన్మయిని దూషించినవారెంతమందో ఉన్నారు. ఈ మధ్యనే ఓ టీవీ యాంకర్ ఫొటోలను మార్ఫింగ్ చేయగా, ఆమె పోలీసులకు […] The post మహిళల కోసమే స్మాష్‌బోర్డ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

సోషల్ మీడియా విస్తరించిన తర్వాత మహిళలు చాలామంది ట్రోలింగ్ బారిన పడుతున్నారు. సెలబ్రిటీలు మొదలు సామాన్య మహిళల్ని వదలకుండా దుర్మార్గంగా ట్రోలింగ్ చేసేవారు ఎక్కువయ్యారు. దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. రాయడానికి కూడా వీల్లేని అసభ్య, పరుష పదజాలంతో చిన్మయిని దూషించినవారెంతమందో ఉన్నారు. ఈ మధ్యనే ఓ టీవీ యాంకర్ ఫొటోలను మార్ఫింగ్ చేయగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తమకుజరిగిన అన్యాయం గురించి నోరు విప్పితేచాలు దాన్ని ఓ పెద్ద నేరంగా పరిగణించడం సోషల్‌మీడియాలో మామూలైంది.

ఇలాంటి మహిళలకు కోసం నుపుర్ తివారీ అనే జర్నలిస్టు తన బృందంతో కలిసి ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారుచేసింది. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించేందుకు, బాధితుల సమస్యల తీర్చేందుకు వీలుగా ‘స్మాష్‌బోరు’్డ పేరిట యాప్‌ను తీసుకొచ్చింది. కేవలం హ్యాష్‌ట్యాగ్ మూమెంట్లకే పరిమితం కాకుండా.. సోషల్‌మీడియా బాధితులైన వారికి మద్దతునివ్వడమే యాప్ ఉద్దేశం. బాధితుల గోడు వెళ్లబోసుకునేందుకు, వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ యాప్ సాయపడుతోంది. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడే మహిళలు, పురుషులు, థర్డ్‌జెండర్ (ట్రాన్స్ మెన్ లేదా ట్రాన్స్ ఉమన్) ఇలా ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యులు కావొచ్చు.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ గురించి తివారీ మాట్లాడుతూ “ బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా నోరు విప్పేలా చేయాలనే లక్షంతో స్మాష్‌బోర్డును తీసుకొచ్చాం. న్యాయవాదులు, జర్నలిస్టులు, సైకాలజిస్టులు వంటి వివిధ రంగాల నిపుణులు దీనితో ఎంతో అనుసంధానమై ఉంటారు. బాధితులు తమ సమస్యలు, మానసిక స్థితి గురించి వీరికి చెప్పుకోవచ్చు. కేవలం బాధితుల కోసమే కాకుండా పురుషాధిక్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంతోమందిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతోనే ఈ యాప్ ప్రారంభించాం. దీని వల్ల మన ఆలోచనల్ని మనలా ఆలోచించగల వ్యక్తులతో పంచుకోవచ్చు” అని చెబుతోంది. త్వరలోనే ఈ యాప్‌ను ప్రాంతీయ భాషల్లో తీసుకువచ్చే అవకాశం ఉంది.

Smashboard is using blockchain to change the way women

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహిళల కోసమే స్మాష్‌బోర్డ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: