భారత కోకిల పుట్టినిల్లు …

  హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం సరోజినీ నాయుడు నివాస గృహం. ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ ఛటోపాథ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నిజాం కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేసేవారు. ఈ బంగళాని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్‌గా పేరు మార్చి గుర్తించసాగారు. వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం, జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ […] The post భారత కోకిల పుట్టినిల్లు … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం సరోజినీ నాయుడు నివాస గృహం.
ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ ఛటోపాథ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నిజాం కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేసేవారు. ఈ బంగళాని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్‌గా పేరు మార్చి గుర్తించసాగారు. వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం, జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, హైదరాబాదులో ఈ గృహం కేంద్ర బిందువుగా ఉండేది.  ఈ విశాల ప్రాంగణం ఛటోపాధ్యాయ కుటుంబం ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం.

గోల్డెన్ త్రెషోల్డ్‌లో సరోజినీ నాయుడు మాత్రమే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి, నటుడు, సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి, నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసముండేవారు. స్వాతంత్య్ర సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్‌కు వచ్చినట్టు, ఆ సందర్భంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు, ఒక మొక్కను నాటినట్టు ఇప్పటికీ ఆనవాళ్లు ఉన్నాయి. గాంధీజీ పునాది వేసిన ఆసుపత్రిని గోపాల్ క్లినిక్ అని ఇప్పటికీ పిలుస్తారు. గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి ఆధీనంలో ఉంది. 1975 నవంబరు 17న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, పద్మజా నాయుడు ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు తదనంతరం సరోజినీ నాయుడు పేరిట 1988లో సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ కమ్మూనికేషన్‌ను గోల్డెన్ త్రెషోల్డ్‌లో ప్రారంభించింది.

 

India nightingale Sarojini Naidu Born in Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత కోకిల పుట్టినిల్లు … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.