శనగపిండితో చర్మసౌందర్యం

  శనగపిండిని రుచికరమైన వంటలకే కాకుండా సౌందర్యానికీ ఉపయోగిస్తారు. మన చర్మంపై రోజంతా తీవ్రమైన ఎండ, ధుమ్మూ ధూళి లాంటివి పేరుకుపోతాయి. దీంతో చర్మం సహజత్వాన్ని మెరుపును కోల్పోతుంది. ముఖంపై నల్లమచ్చలు, మొటిమల సమస్య పీడిస్తుంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేసే చర్మం పాడయిపోతుంది. ఈ సమస్యలకు శనగపిండితో చెక్ పెట్టొచ్చు. సహజసిద్ధమైన శనగపిండి వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. శనగపిండిలో ‘యాంటీ మైక్రోబియల్’ గుణం ఉంటుంది. ఇది చర్మంపై మురికిని, మృతకణాలను తొలగిస్తుంది. ముఖంపై అవాంఛిత […] The post శనగపిండితో చర్మసౌందర్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శనగపిండిని రుచికరమైన వంటలకే కాకుండా సౌందర్యానికీ ఉపయోగిస్తారు. మన చర్మంపై రోజంతా తీవ్రమైన ఎండ, ధుమ్మూ ధూళి లాంటివి పేరుకుపోతాయి. దీంతో చర్మం సహజత్వాన్ని మెరుపును కోల్పోతుంది. ముఖంపై నల్లమచ్చలు, మొటిమల సమస్య పీడిస్తుంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేసే చర్మం పాడయిపోతుంది. ఈ సమస్యలకు శనగపిండితో చెక్ పెట్టొచ్చు. సహజసిద్ధమైన శనగపిండి వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు.

శనగపిండిలో ‘యాంటీ మైక్రోబియల్’ గుణం ఉంటుంది. ఇది చర్మంపై మురికిని, మృతకణాలను తొలగిస్తుంది. ముఖంపై అవాంఛిత రోమాలు అందాన్ని తగ్గించేస్తాయి. కానీ క్రమంతప్పకుండా శనగపిండి వాడితే రోమాలు తగ్గి ముఖంపై మెరుపు వస్తుంది. ముఖంపై రోమాలు ఎక్కువగా ఉంటే శనగపిండిలో నిమ్మరసం, వెన్న, చందనం పొడి కలిపి పట్టించాలి. ఆరిపోయాక చల్లని నీటిలో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

1. ఇదొక సహజమైన స్క్రబ్. చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. ‘ఫేస్‌ప్యాక్’తో పాటు బాడీ స్క్రబ్ చేసుకోవచ్చు. శారీరక దుర్గంధాన్ని తొలగించి తాజాదనాన్ని కలిగిస్తుంది.

2. తీక్షణమైన ఎండతో చర్మం కందిపోతుంది. స్కిన్‌ట్యాన్ అయిపోతుంది. ఇలాంటప్పుడు పెరుగులో శనగపిండి కలిపి ముఖానికి రాసుకోండి. ముఖానికి చల్లదనాన్ని ఇచ్చి ట్యానింగ్‌నూ దూరం చేస్తుంది.

3. జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల బాధ ఎక్కువ ఉంటుంది. శనగపిండి ఈ చర్మానికి వరం లాంటిది. ఇది ముఖం నుంచి అదనపు జిడ్డును పీల్చేస్తుంది. దీంతో మొటిమల సమస్య దూరమవుతుంది. మొటిమలు ఎక్కువగా ఉంటే గుడ్డు తెల్ల భాగంలో శనగపిండి కలిపి ముఖానికి పట్టించాలి.

4. శనగపిండిలో నిమ్మరసం కలిపి పెట్టుకుంటే ముఖంలో నల్లదనం తొలగిపోయి, బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. అలాగే ముఖంలో మెరుపు వస్తుంది.

5. శనగపిండి నల్ల వలయాల్ని దూరం చేస్తుంది. ఈ పిండిలో నారింజ తొక్క, వెన్న కలిపి పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.

6. ఎక్కువశాతం మెడ, చేతులు నలుపెక్కుతాయి. సూర్యకిరణాలు నేరుగా పడటంతో ఇలా అవుతుంది. శనగపిండిలో పెరుగు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి చేతులు, మెడకు పెట్టుకోవాలి. 20 నిమిషాలపాటు ఉంచి చన్నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే సరిపోతుంది.

7. శనగపిండి కేశాలను ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. ఇది హెయిర్ ప్యాక్, హెయిర్ స్పా రూపంలోనూ పనిచేస్తుంది. ఇది కేశాలకు పోషణ ఇస్తుంది. దీంతో చుండ్రు సమస్య కూడా తగ్గి జుట్టు మెరుస్తుంది.

8. వేర్వేరు రకాల చర్మాలకు శనగపిండి వివిధ రకాలుగా పనిచేస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారైతే రోజ్‌వాటర్‌తో శనగపిండి పాక్ వేసుకుని ముఖానికి పట్టించాలి. తర్వాత ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మం నుంచి అదనపు ఆయిల్‌ను పీల్చుకుని, ముఖాన్ని తాజాగా చేస్తుంది.

9. పొడి చర్మం గలవారు శనగపిండిలో తేనె, పచ్చిపాలు, కొద్దిగా పసుపు కలిపి పట్టించాలి. చర్మం పొడిబారదు.

Gram flour a natural ingredient for skin care

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శనగపిండితో చర్మసౌందర్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.