సుహాసిని అద్భుత ఊహాసృష్టి

  రవివర్మ మహిళల రాజస సౌందర్యాల ఛాయాచిత్రకళ భారతీయ సంప్రదాయం, పాశ్చాత్య చిత్రకళా మెళకువలు కలబోసిన అద్భుత సౌందర్యం రాజా రవివర్మ చిత్రాల్లో ప్రతిబింబిస్తాయి. మహిళల్లో అనేక కోణాలను చిత్రకారుడు రాజా రవివర్మ మాత్రమే అర్థం చేసుకోగలిగాడు. ఆయన బొమ్మల్లో కనిపించే సజీవ సౌందర్యాన్ని పునఃసృష్టించాడు ఫొటోగ్రాఫర్ జి. వెంకట్‌రామ్. ఈ ఆలోచనకు ఆద్యురాలు ప్రముఖ నటి సుహాసినీ మణిరత్నం. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందే దిశగా నడిపించాలనే ప్రయత్నంలో పదేళ్ల క్రితం ‘నామ్ చారిటబుల్ […] The post సుహాసిని అద్భుత ఊహాసృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రవివర్మ మహిళల రాజస సౌందర్యాల ఛాయాచిత్రకళ

భారతీయ సంప్రదాయం, పాశ్చాత్య చిత్రకళా మెళకువలు కలబోసిన అద్భుత సౌందర్యం రాజా రవివర్మ చిత్రాల్లో ప్రతిబింబిస్తాయి. మహిళల్లో అనేక కోణాలను చిత్రకారుడు రాజా రవివర్మ మాత్రమే అర్థం చేసుకోగలిగాడు. ఆయన బొమ్మల్లో కనిపించే సజీవ సౌందర్యాన్ని పునఃసృష్టించాడు ఫొటోగ్రాఫర్ జి. వెంకట్‌రామ్. ఈ ఆలోచనకు ఆద్యురాలు ప్రముఖ నటి సుహాసినీ మణిరత్నం.

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందే దిశగా నడిపించాలనే ప్రయత్నంలో పదేళ్ల క్రితం ‘నామ్ చారిటబుల్ ట్రస్ట్’ను ఏర్పాటుచేసింది సుహాసిని. ఇప్పటి వరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించిందీ సంస్థ. 2015లో చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేసి విరాళాలు సేకరించింది. ఆ సందర్భంలో రాజా రవివర్మ ట్రావెన్‌కోర్ రాజవంశానికి చెందిన పెయింటింగ్స్‌లో వేసిన ఆభరణాలు మోడల్స్ స్టయిలింగ్ కోసం వాడారు. ఆ క్రమంలో సుహాసినీ, వెంకట్‌రామ్‌లకు వచ్చిన ఆలోచనే ఈ క్యాలెండర్.

నామ్ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రవివర్మ చిత్రాలను రీ క్రియేట్ చేశారు. రవివర్మ చిత్రాల్లో కనిపించే రంగుల కలబోతను, మూడ్‌ను, చిత్రాల్లో మహిళల ముఖాల్లో కనిపించే రాజసాన్ని, సౌందర్యాన్ని యథాతధంగా ఫొటోల్లో బంధించాడు ఫొటోగ్రాఫర్ వెంకట్‌రామ్. అవే దుస్తులు, అలంకారాలు, నగలతో ప్రముఖ నటీమణులు రమకృష్ణ, ఖుష్బు, నదియా, శృతిహాసన్, సమంత, శోభన, లిజీ, మంచులక్ష్మి, కలర్స్ స్వాతి ముస్తాబయ్యారు.

 

 

ఈ క్యాలెండర్ అంత తేలిగ్గా రూపం పోసుకోలేదు. నటీమణుల్ని సంప్రదించటం దగ్గర నుంచి ఆ కాలం నాటి నగలు వెదికి పట్టుకుని అచ్చం రవివర్మ చిత్రాల్లాగే కనిపించేలా చేసేందుకు టీం చాలా కష్టపడింది. 19వ శతాబ్దం నాటి సంస్కృతి సంప్రదాయ వస్త్రాలు, వాతావరణం తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా వస్త్రాలు డిజైన్ చేశారు. అప్పటి పట్టు చీరలకు, ఇప్పటి వాటికీ ఎంతో తేడా ఉంది. తొమ్మిది అడుగుల చీరను తీసుకుని అంచుల్ని విడిగా కలిపికుట్టారు. మేకప్ బ్యాక్‌గ్రౌండ్ కోసం ఆర్ట్ డైరక్టర్స్ ఎన్నో చిత్రాలు గీశారు. డే లైట్స్ వాడకుండా కేవలం ఫ్లాష్‌లైట్స్‌తో ఫొటోషూట్ చేశారు. నటి శోభన ఫొటోషూట్ గంటలకొద్దీ సమయం తీసుకుంది. చిన్న పాపను చంకనెత్తుకుని, పక్కనే కుక్కపిల్లను స్టడీగా ఉంచటం కోసం చాలా కష్టపడ్డారు. ఈ పెయింటింగ్‌లో ఉన్న కుక్కను తేవటం అన్నింటికన్నా కష్టం అయిందంటున్నాడు వెంకట్‌రామ్.

దర్పం ఉట్టిపడే దుస్తులు, ఆభరణాలు ధరించిన 12 మంది హీరోయిన్లతో రూపొందించిన ఈ క్యాలెండర్‌లోని ప్రతి పేజీ మహిళాశక్తినీ, అందాన్ని ప్రతిబింబిస్తోంది. ఇందులో ట్రావెన్‌కోర్ మహారాణిగా నటించిన చాముండేశ్వరి నటికాదు, మోడల్ కాదు.. నామ్ సంస్థ ద్వారా చేయూతనందుకుంటున్న ఓ బాధితురాలు. ఈ క్యాలెండర్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ఉపయోగించనున్నట్లు సుహాసిని చెబుతోంది. క్యాలెండర్‌తో పాటు ఫొటోలున్న బుక్‌లెట్ కూడా విక్రయిస్తున్నారు. క్యాలెండర్‌లు కావాలనుకున్నవాళ్లు 91763 07415, 98410 97885 నెంబర్లలో సంప్రదించవచ్చు.

South Actresses Recreate Raja Ravi Varma Paintings

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సుహాసిని అద్భుత ఊహాసృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.